కరోనా నుంచి బయటపడిన రాజమౌళి

దర్శకుడు రాజమౌళి కరోనా నుంచి బయటపడ్డాడు. 2 వారాలుగా హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న ఈ డైరక్టర్, తను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రకటించాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులందరికీ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్టు తెలిపాడు జక్కన్న.

2 వారాల కిందట తనకు కరోనా సోకిన విషయాన్ని ప్రకటించి అందర్నీ ఆందోళనకు గురిచేశాడు రాజమౌళి. తను, తన కుటుంబ సభ్యులంతా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్తున్నామని, తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు.

అలా 2 వారాలుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన రాజమౌళి, ఇప్పుడు తను పూర్తిగా కరోనా నుంచి బయటపడినట్టు ప్రకటించాడు.

తనకు కరోనా సోకిన టైమ్ లోనే దాన్నుంచి విజయవంతంగా బయటపడతానని, ఆ వెంటనే ప్లాస్మా దానం చేస్తానని ప్రకటించాడు రాజమౌళి. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని గుర్తుచేశాడు. తన శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి మరో 3 వారాల టైమ్ పడుతుందని, ఆ వెంటనే ప్లాస్మా డొనేట్ చేస్తానని తెలిపాడు.