ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పక్కా…

మొన్నటివరకు ఊగిసలాడిన దిల్ రాజు ఈసారి ఫిక్స్ అయ్యారు. తను నిర్మించిన మల్టీస్టారర్ ప్రాజెక్టు “V” సినిమాను ఓటీటీకి ఇచ్చేశారు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తో డీల్ దాదాపు క్లోజ్ అయినట్టే. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 5న ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కు వస్తుంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాను 31 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. నాని-సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా కావడంతో పాటు, మూవీపై భారీ అంచనాలు ఉండడంతో ఈ స్థాయిలో రేటు పలికినట్టు చెబుతున్నారు.

బిజినెస్ యాంగిల్ లో చూసుకుంటే ఈ మొత్తం దిల్ రాజుకు తక్కువే. సినిమా థియేటర్లలో రిలీజై.. శాటిలైట్+డిజిటల్ రైట్స్ కలుపుకంటే ఇంతకంటే ఎక్కువ మొత్తమే వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు ఇప్పటికిప్పుడు ఓపెన్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో దిల్ రాజు ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలనే ఫిక్స్ అయినట్టున్నారు.