వకీల్ సాబ్ పనులు మళ్లీ మొదలు

ఆగిపోయిన వకీల్ సాబ్ పనులు మళ్లీ మొదలయ్యాయి. అయితే సినిమా సెట్స్ పైకి రాలేదు కానీ రెండు కీలకమైన పనులు మాత్రం మొదలయ్యాయి. వీటిలో ఒకటి టీజర్ ఎడిటింగ్ కాగా.. రెండోది రీ-రికార్డింగ్.

వచ్చేనెల పవన్ కల్యాణ్ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఆరోజున వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు నిర్మాత దిల్ రాజు. ఆ పనులు నిన్నట్నుంచి మొదలయ్యాయి. టీజర్ ఎడిటింగ్ వర్క్ ను ఎడిటర్ ప్రవీణ్ పూడి మొదలుపెట్టాడు. మరో 10 రోజుల్లో టీజర్ కట్ రెడీ అయిపోతుంది.

మరోవైపు పెండింగ్ రీ-రికార్డింగ్ పనుల్ని తమన్ స్టార్ట్ చేశాడు. లాక్ డౌన్ కు ముందే వకీల్ సాబ్ రీ-రికార్డింగ్ పనులు మొదలుపెట్టిన తమన్.. ఇప్పుడు మిగతా పనిని పూర్తిచేస్తున్నాడు. దీంతో పాటు టీజర్ కు కూడా రీ-రికార్డింగ్ చేయబోతున్నాడు.

ఇలా వకీల్ సాబ్ వర్క్ మరోసారి మొదలైంది. సినిమా మాత్రం సెట్స్ పైకి రావడానికి ఇంకొంత టైమ్ పడుతుంది. మూవీకి సంబంధించి ఓ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో పడింది. 10 రోజుల వర్క్ తో అది పూర్తవుతుంది.