ఈ వీకెండ్ ఓటీటీ రిలీజులు ఇవే

ఒకప్పుడు వీకెండ్ వస్తే థియేటర్లలో ఏ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు వీకెండ్ వస్తే ఓటీటీలో ఏది రిలీజ్ అవుతుందా అని చూడాల్సిన పరిస్థితి. ఈ వీకెండ్ కూడా ఓటీటీలోకి కొత్త స్టఫ్ వచ్చి చేరింది. ఆల్రెడీ శ్రీదేవి కూతురు జాన్వి నటించిన గుంజన్ సక్సేనా ఓటీటీ మాధ్యమంలోకి రాగా.. రేపట్నుంచి మరింత ఒరిజినల్ కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది.

నెట్ ఫ్లిక్స్ లో గుంజన్ సక్సేనాతో పాటు ప్రాజెక్ట్ పవర్ అనే మరో కొత్త సినిమా రేపట్నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. అటు అమెజాన్ లో వరల్డ్ టఫెస్ట్ రేస్ అనే సినిమా, ఎమ్మెక్స్ ప్లేయర్ లో డేంజరస్ అనే సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి.

ఇక డిస్నీ హాట్ స్టార్ లో ఖుదా హఫీస్, జీ 5లో లాక్ అప్, అభయ్ 2, ఆహా యాప్ లో జోహార్, మెట్రో కథలు కంటెంట్ అందుబాటులోకి రాబోతున్నాయి.