మారుతి త్రీ రోజెస్

ఈ లాక్ డౌన్ 4 నెలల కాలంలో ఏం చేశారనే ప్రశ్నకు మారుతి నేరుగా సమాధానం ఇవ్వలేదు. కేవలం కొన్ని కథలు మాత్రమే రాశానని చెప్పి తప్పించుకున్నాడు. కానీ ఇదే టైమ్ లో మారుతి మరో పని కూడా చేశాడు. అతడు ఏకంగా ఓ వెబ్ సిరీస్ కు రూపకల్పన చేశాడు. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఆయన బయటపెట్టలేదు.

త్రీ-రోజెస్ అనే టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ రెడీ చేశాడు మారుతి. దాని బాధ్యతల్ని తన దగ్గర వర్క్ చేసే రవి అనే రైటర్ కు అప్పగించాడు. మొత్తం 8 ఎపిసోడ్స్ గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఆల్రెడీ 5 ఎపిసోడ్స్ రైటింగ్ వర్క్ పూర్తయిందని ప్రకటించాడు మారుతి. మిగిలిన 3 ఎపిసోడ్స్ వర్క్ కూడా పూర్తయిన తర్వాత అప్పుడు నటీనటులు ఎవరనే విషయాన్ని ప్రకటిస్తానంటున్నాడు.

అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ లో తన వెబ్ సిరీస్ వస్తుందని తెలిపాడు మారుతి. నిజానికి దీనికంటే ముందే తనకు చాలా వెబ్ సిరీస్ ఆఫర్లు వచ్చాయని, కానీ ఎందుకో అప్పుడు చేయాలని అనిపించలేదని, ఇప్పుడు చేయాలని అనిపిస్తోందని తెలిపాడు. అల్లు అరవింద్ చెప్పాడు కాబట్టి మారుతి చేస్తున్నాడు. అంతే.. అంతకుమించి ఇంకెలాంటి కారణాల్లేవు.