వేశ్య పాత్రలో ఇషా రెబ్బా

సిల్వర్ స్క్రీన్ పై ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోయిన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా, ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. మంచి మంచి పాత్రలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ దక్కించుకుంది.

త్వరలోనే కాల్ గర్ల్ గా నటించబోతోంది ఈషా రెబ్బ. అర్బన్ బ్యాక్ డ్రాప్ లో ఓ వేశ్య జీవితం ఎలా ఉంటుందనే విషయాన్ని మూడు దశల్లో చూపించబోతున్నారు. దర్శకుడు సంపత్ నంది కాన్సెప్ట్ ఇది. దీనికి అతడి దగ్గర డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న అశోక్ అనే వ్యక్తి దర్శకత్వం వహించబోతున్నాడు.

లస్ట్ స్టోరీస్ లో స్వయంతృప్తి పొందే గృహిణి పాత్రలో కనిపించబోతోంది ఇషా రెబ్బా. ఇదే పాత్రను హిందీలో కియారా అద్వానీ పోషించింది. ఈ పాత్రతో ఆమె సూపర్ పాపులర్ అయింది. ఇప్పుడీ క్యారెక్టర్ తో పాటు కాల్ గర్ల్ క్యారెక్టర్ లో కూడా కనిపించబోతోంది ఈషారెబ్బ. ఈ రెండు పాత్రలతో ఆమెకు హాట్ ఇమేజ్ రావడం ఖాయం.