చెల్లికి విషమిచ్చి చంపేశాడు…ఎందుకంటే…!

కేరళలోని కాసరగాడ్ అనే పట్టణంలో ఈ ఘోరం జరిగింది. ఓ యువకుడు తన సొంత చెల్లిని ఐస్ క్రీమ్ లో విషం పెట్టి చంపేశాడు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ఆగస్టు నాలుగో తేదీ రాత్రి ఐస్ క్రీమ్ తిన్నారు. ఐదో తేదీ ఉదయం ఆ అమ్మాయి మరణించింది. పోలీసులు ఈ కేసుని ఛేదించి ఆమె అన్నే ఆ అమ్మాయిని హత్య చేసినట్టుగా కనుగొన్నారు.  ఆల్బిన్ అనే  ఆ 22 ఏళ్ల యువకుడు… తానే తన చెల్లెలిని హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో అంగీకరించాడు. దాంతో అతడిని గురువారం నాడు అరెస్టు చేశారు.

ఎందుకు చంపావని పోలీసులు అడగ్గా… అతను చాలా విచిత్రమైన సమాధానం చెప్పాడు. తాను ఒంటరిగా ఉండాలనే ఉద్దేశంతోనే చెల్లిని చంపేశానన్నాడు.

ఆ అమ్మాయితో పాటు ఐస్ క్రీమ్ తిన్న తండ్రి బెన్నీ సైతం అనారోగ్యంతో హాస్పటల్లో చేరాడు. అతను కోలుకోగా బాలిక మాత్రం మరణించింది. ఆమె తల్లి ఆరోగ్యంగానే ఉందని పోలీసులు వెల్లడించారు.