నిహారిక నిశ్చితార్థం పూర్తి

నాగబాబు కుమార్తె నిహారికకు, గుంటూరులో ఓ పెద్ద పోలీస్ కుటుంబానికి చెందిన చైతన్య జొన్నలగొడ్డకు మధ్య పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలిసిందే. ఇప్పుడీ పెళ్లికి సంబంధించి తొలి అడుగు పడింది. నిన్న రాత్రి నిహారిక-చైతన్య ఎంగేజ్ మెంట్ జరిగింది.

హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో వీళ్ల ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ నిశ్చితార్థానికి కేవలం ఇరు కుటుంబాల బంధువులు మాత్రమే హాజరయ్యారు. అటు ఇటుగా ఓ 30 మంది మాత్రమే ఉంటారు. మెగా హీరోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ మినహా మిగతా మెగా హీరోలంతా హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, కల్యాణ్ దేవ్.. ఇలా హీరోలంతా వచ్చారు. అందరి సమక్షంలో నిహారిక-చైతన్య పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు.

డిసెంబర్ లో నిహారిక-చైతన్య వివాహం జరిపించడానికి నిశ్చయించారు. అప్పటికి కరోనా పరిస్థితులు ఉండవు కాబట్టి కాస్త గ్రాండ్ గానే పెళ్లి చేయాలని నిర్ణయించారు నాగబాబు.