పోలీస్ శాఖలో 10 మందికి రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది అధికారులను రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రతీ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఈ పురస్కారాలను పోలీస్ శాఖలో ప్రతిభావంతులకు అందిస్తారు. ఈ సారి ఈ జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.

పురస్కారానికి ఎంపికైన వారు:

  • రాచకొండ ఏసీపీ నాయిని భుజంగరావు
  • మనసాని రవీందర్‌రెడ్డి డీడీ ఏసీబీ హైదరాబాద్
  • చింతలపాటి యాదగిరి, ఏసీపీ
  • శ్రీనివాస్ కుమార్, ఏసీపీ సైబరాబాద్
  • అడిషనల్ కమాండెంట్, మోతు జయరాజ్ వరంగల్
  • డబ్బీకార్ ఆనంద్ కుమార్, డీఎస్పీ ఇంటెలిజన్స్ హైదరాబాద్
  • బోయిని క్రిష్టయ్య ఏఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
  • కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి డీఎస్పీ, హైదరాబాద్
  • సీఐ ఇరుకుల నాగరాజు, హైదరాబాద్
  • మల్కాజ్‌గిరి ఎస్ఐ షేక్ సాధిక్‌ అలీ