నిలకడగా బాలు ఆరోగ్యం

కరోనా బారిన పడిన లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. ఐసీయూలో బాలసుబ్రమణ్యంకు ఆక్సిజన్ అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన శరీర భాగాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా వెల్లడించారు బాలు. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక నేరుగా వెళ్లి హాస్పిటల్ లో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం రోజురోజుకు విషమించసాగింది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆయన్ను మరో హాస్పిటల్ కు షిఫ్ట్ చేసి, ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు.

అలా ఐసీయూలో చేరిన బాలు, ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. బాలు త్వరగా కోలుకొని బయటకు రావాలని టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కాంక్షిస్తున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా అయితే ఏకంగా ఓ భావోద్వేగమైన వీడియో రిలీజ్ చేశారు.