Telugu Global
National

అడుసు తొక్కిన బాబు... కాళ్లు కడుక్కోడానికి ఇబ్బందులు...

చంద్రబాబు అమరావతి విషయంలో ఆ అడుసు తొక్కేశారు. ఇప్పుడు కాళ్లు కడుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు మనస్ఫూర్తిగా సమర్థించకపోయినా పర్వాలేదు, కనీసం అడ్డుపడకుండా ఉంటే అమరావతిలో ఇన్ని ఆందోళనలు జరిగేవి కాదు. భూములిచ్చిన రైతులు కూడా అసెంబ్లీ ఉంది కదా అని సరిపెట్టుకునేవారు. అలా సరిపెట్టుకున్నంత మాత్రాన వారికి వచ్చే నష్టమేమీ లేదు. చంద్రబాబు మాయలో పడి వారికి కొత్తగా ఒరిగింది కూడా ఏమీ లేదు. ఎటొచ్చీ […]

అడుసు తొక్కిన బాబు... కాళ్లు కడుక్కోడానికి ఇబ్బందులు...
X

చంద్రబాబు అమరావతి విషయంలో ఆ అడుసు తొక్కేశారు. ఇప్పుడు కాళ్లు కడుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు మనస్ఫూర్తిగా సమర్థించకపోయినా పర్వాలేదు, కనీసం అడ్డుపడకుండా ఉంటే అమరావతిలో ఇన్ని ఆందోళనలు జరిగేవి కాదు.

భూములిచ్చిన రైతులు కూడా అసెంబ్లీ ఉంది కదా అని సరిపెట్టుకునేవారు. అలా సరిపెట్టుకున్నంత మాత్రాన వారికి వచ్చే నష్టమేమీ లేదు. చంద్రబాబు మాయలో పడి వారికి కొత్తగా ఒరిగింది కూడా ఏమీ లేదు. ఎటొచ్చీ తాను, తన అనుచరులు కొన్న భూములకి విలువ లేకుండా పోతుందనే విషయమే చంద్రబాబుకి నిద్రపట్టకుండా చేస్తోంది.

అందుకే అమరావతిని భుజానికెత్తుకుని ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడిక చంద్రబాబు రైతుల్ని సముదాయించలేరు, ఇటు మూడు రాజధానులను ఆపే సత్తా ఆయనకి లేదు. అందుకే ఎటూ తేల్చుకోలేక రోజుకోసారి జూమ్ ద్వారా బైటకొచ్చి తన సందేశాలను వినిపిస్తున్నారు. ఐదేళ్లలో తాను ఏంచేశాననే విషయాన్ని సరికొత్తగా ఇప్పుడు మళ్లీ చెప్పుకోవాల్సి వస్తోంది.

అమరావతి స్వయం సమృద్ధ ప్రాజెక్ట్ అని, 50వేలు ఖర్చు పెడితే.. దానిలో 50శాతం వెనక్కి వస్తుందని చెప్పారు బాబు. అమరావతి వల్ల 2లక్షల కోట్లు, లేదా 3లక్షల కోట్లు ఆదాయం వస్తుందని గాలి లెక్కలు చెప్పారు. అంత ఆదాయం వచ్చే ప్రాజెక్ట్ అయితే.. ఐదేళ్లలో దాన్ని ఎందుకు విస్మరించినట్టు. మిగతావన్నీ పక్కనపెట్టి యుద్ధ ప్రాతిపదికన అమరావతిని పూర్తి చేస్తే అడ్డొచ్చేవారు ఎవరైనా ఉన్నారా? అలా చేసి చూపెడితే జగన్ కి మూడు రాజధానుల ఆలోచన కూడా వచ్చేది కాదు కదా? అమరావతి పేరు చెప్పి ఐదేళ్లు పప్పు బెల్లాలు పంచుకున్నట్టు నిధులు ఆరగించడం వల్లే.. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోలేదనేది వైసీపీ విమర్శ.

ఈ విమర్శలకు సమాధానం చెప్పలేక, అమరావతిని అభివృద్ధి చేస్తే లక్షల కోట్లు వస్తాయని చంద్రబాబు ఎవర్ని నమ్మించాలనుకుంటున్నారు? ఇలా జూమ్ ద్వారా రోజూ బైటకొచ్చి ఎంతమందిని మభ్యపెట్టాలనుకుంటున్నారు

రోజురోజుకీ చంద్రబాబు చెప్పే విషయాల్లో పస తగ్గిపోతున్న విషయం టీడీపీ నేతలకి కూడా అర్థమవుతోంది. అమరావతి గురించి చెప్పే లెక్కలు కనీసం ఆప్రాంత వాసుల్ని సైతం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత కాస్తా.. రానురాను అమరావతి ప్రతిపక్షనేతగా మిగిలిపోబోతున్నారు.

First Published:  15 Aug 2020 1:18 AM GMT
Next Story