Telugu Global
International

ఆత్మ నిర్భర్ భారత్ సాధిద్దాం " మోదీ స్వాతంత్ర దినోత్సవ పిలుపు

దేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశాన్ని మన సైనిక దళాలు నిరంతరం మనలను రక్షిస్తున్న తీరును కొనియాడారు. దేశ సరిహద్దును రక్షించడమే కాకుండా.. అంతర్గత భద్రతను కూడా చూసుకుంటున్న సైనికులందరికీ వేవేల వందనాలు తెలిపారు. ‘దేశం అనేక సవాళ్లను ఎదుర్కుంటున్నది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం […]

ఆత్మ నిర్భర్ భారత్ సాధిద్దాం  మోదీ స్వాతంత్ర దినోత్సవ పిలుపు
X

దేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశాన్ని మన సైనిక దళాలు నిరంతరం మనలను రక్షిస్తున్న తీరును కొనియాడారు. దేశ సరిహద్దును రక్షించడమే కాకుండా.. అంతర్గత భద్రతను కూడా చూసుకుంటున్న సైనికులందరికీ వేవేల వందనాలు తెలిపారు.

‘దేశం అనేక సవాళ్లను ఎదుర్కుంటున్నది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నాము. స్వాతంత్ర సంగ్రామ ప్రేరణలో దేశం ముందుకు వెళ్తున్నది. ఆత్మనిర్భర్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్దమైంది. కరోనా విపత్కర సమయంలో దేశమంతా ఒక్కడిగా నిలబడింది. దేశంలోని ప్రతీ కుటుంబంలో 25 ఏళ్లు నిండిన యువత తమ సొంత కాళ్లపై నిలబడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పటికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా ఇంకా మన దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోయాము. ఇకపై ఈ తప్పు జరుగకూడదు. మనం స్వయం సమృద్ధి దిశగా బలమైన అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆత్మనిర్భర్ కోసం మనందరి సంకల్పం తోడవ్వాలి. యువత తమ ఆత్మవిశ్వాసంతో తప్పక ఆత్మనిర్భర్ సాధిస్తుంది’ అని మోదీ అన్నారు.

చైనా వస్తువలను దిగుమతి చేసుకోవడం పూర్తిగా నిషేధించాలి. అసలు మనం ఇతర దేశాల వస్తువులను దిగుమతి చేసుకోవడం ఆపేయాలి. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకుందాం. భారత తయారీ వస్తువులంటే నాణ్యమైన వస్తువులకు అడ్డా అనే పేరు తెచ్చుకుందాం. ఇకపై మనం వోకల్ ఫల్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందాం అని మోదీ పిలుపునిచ్చారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో మన దేశం కొత్త పుంతలు తొక్కుతున్నది. వ్యవసాయం నుంచి బ్యాకింగ్ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టామని మోదీ వెల్లడించారు.

రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధంగా నూతన విధానాన్ని రూపొందించాము. మరోవైపు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు తగినంత ప్రోత్సాహం కల్పిస్తున్నాము. అంటే ఇకపై రైతులే ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే వెసులుబాటు కలుగనుంది. స్వచ్చమైన తాగునీరే మన ఆరోగ్యాలకు రక్ష.. కాబట్టి జల్ జీవన్ మిషన్ పేరుతో ఆరోగ్యంలో తప్పకుండా గొప్ప మార్పును మనం చూడబోతున్నాము అని మోదీ వివరించారు.

కరోనా నేపథ్యంలో ఎర్రకోట వద్ద జెండా పండుగను అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. అతిథుల కోసం వేదిక వద్ద ప్రభుత్వమే మాస్కులు సిద్దం చేసింది. ఇక కుర్చీల మధ్య భౌతిక దూరం ఏర్పాటు చేయడమే కాకుండా, అక్కడకు వచ్చిన వారందరికీ థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు 4 వేల మంది అతిథులు హాజరయ్యారు. వీరి కోసం అదే స్థాయిలో భద్రతా సిబ్బంది మోహరించారు. ఎర్ర‌కోట వేదిక‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రసంగించడం ఇది వరుసగా ఏడోసారి కావ‌డం విశేషం.

First Published:  14 Aug 2020 11:11 PM GMT
Next Story