కొడుకును పరిచయం చేస్తున్న దర్శకుడు… అయితే…

దర్శకుడు సతీష్ వేగేశ్న తన కొడుకు సమీర్ ను హీరోగా పరిచయం చేయాలని చాన్నాళ్ల కిందటే అనుకున్నాడు. ఈ విషయం కూడా పాతదే. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టును కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు వేగేశ్న. తన కొడుకు హీరోగా సినిమా ప్రకటించాడు.

నిజానికి తనయుడ్ని సోలో హీరోగా పరిచయం చేయాలని వేగేశ్నకు లేదు. అందుకే మల్టీస్టారర్ కథ రాసుకున్నాడు. మరో హీరోగా నటుడు శ్రీహరి కొడుకు మేఘాంష్ ను తీసుకున్నాడు. వీళ్లిద్దరు హీరోలుగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. శ్రీహరి జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా ప్రకటించారు.

నిజానికి సతీష్ వేగేశ్న చేతిలో మరో బిగ్ ప్రాజెక్టు ఉంది. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేయాల్సి ఉంది. కానీ సదరు పెద్ద హీరో ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో, ఈ గ్యాప్ లో తనయుడితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.