Telugu Global
International

సెప్టెంబరులో తెరుస్తారా ?... డిసెంబరు వరకు మూస్తారా?!

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ని….  అన్ లాక్ చేసే  ప్రక్రియ మూడో దశలో ఉన్న నేపథ్యంలో షాపులు, రెస్టెరెంట్లు, మాల్స్ లాంటివన్నీ తెరిచేశారు. ఇప్పుడు అందరూ స్కూళ్లు, కాలేజీలను ప్రారంభించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది…అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్కూళ్లు తెరిచిన దేశాల్లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈ విషయంలో ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపడానికి సిద్ధంగా లేరు. అలాగే […]

సెప్టెంబరులో తెరుస్తారా ?... డిసెంబరు వరకు మూస్తారా?!
X

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ని…. అన్ లాక్ చేసే ప్రక్రియ మూడో దశలో ఉన్న నేపథ్యంలో షాపులు, రెస్టెరెంట్లు, మాల్స్ లాంటివన్నీ తెరిచేశారు. ఇప్పుడు అందరూ స్కూళ్లు, కాలేజీలను ప్రారంభించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది…అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్కూళ్లు తెరిచిన దేశాల్లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈ విషయంలో ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది.

ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపడానికి సిద్ధంగా లేరు. అలాగే రాష్ట్రాలు సైతం స్కూళ్లు, కాలేజీలను ప్రారంభించడానికి సిద్ధంగా లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

సెప్టెంబరునుండి సీనియర్ స్టూడెంట్లకు విద్యాసంవత్సరం మొదలవుతుందనే వార్తలు వినబడిన నేపథ్యంలో… ఇప్పటివరకు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరోనా తీవ్రతని బట్టే నిర్ణయం ఉంటుందని… నిర్ణయం తీసుకున్న తరువాత ప్రభుత్వం ప్రకటిస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

రాష్ట్రప్రభుత్వాలు స్కూళ్లను తెరిచే విషయంలో నిర్ణయాలు తీసుకున్నా అందుకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే సెప్టెంబరులో స్కూళ్ల ప్రారంభంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేలగానే… సోషల్ మీడియాలో డిసెంబరు వరకు స్కూళ్లు తెరవవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందనే పుకారు చక్కర్లు కొట్టటం మొదలైంది. ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ప్యాక్ట్ చెక్…ట్విట్టర్ వేదికగా దీని గురించి వివరణ ఇచ్చింది. సెప్టెంబరులో స్కూళ్లు తెరవాలని కానీ… డిసెంబరు వరకు మూసే ఉంచాలని కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని పిబిఐ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.

First Published:  14 Aug 2020 9:35 PM GMT
Next Story