Telugu Global
Cinema & Entertainment

మరోసారి తెరపైకి మాధవీలత

ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం బీజేపీ లీడర్ మాధవీలత మరోసారి ముఖానికి రంగేసుకుంది. నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఐదేళ్ల నుంచి సినిమాలు చేయడం మానేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాధవీలత సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి కళ్యాణ్ డైరెక్షన్ లో రూపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా “లేడీ”. ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని సత్యనారాయణ గొరిపర్తి, […]

మరోసారి తెరపైకి మాధవీలత
X

ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం బీజేపీ లీడర్ మాధవీలత మరోసారి ముఖానికి రంగేసుకుంది. నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఐదేళ్ల నుంచి సినిమాలు చేయడం మానేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మాధవీలత సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి కళ్యాణ్ డైరెక్షన్ లో రూపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా “లేడీ”. ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని సత్యనారాయణ గొరిపర్తి, కళ్యాణ్ జాయింట్ గా నిర్మిస్తున్నారు.

ఒకే ఒక క్యారెక్టర్ తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా దర్శకుడు కళ్యాణ్ చెబుతున్నాడు. అలానే ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నాడు. సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దామంటున్నాడు. అంటే సినిమా మొత్తం మాధవీలత మాత్రమే కనిపిస్తుందన్నమాట. కెమెరా ఆమె మీదనే ఉంటుందన్నమాట.

First Published:  17 Aug 2020 2:00 AM GMT
Next Story