Telugu Global
Cinema & Entertainment

నిధి అగర్వాల్ చాలా బాధపడుతోంది

ఈరోజు హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టినరోజు. చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. కానీ ఈ ఇస్మార్ట్ భామ మాత్రం చాలా బాధపడుతోంది. దీనికి ఓ కారణం ఉంది. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులుకు చాలా దగ్గర అయిపోయింది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నిధి ఈరోజు తన […]

నిధి అగర్వాల్ చాలా బాధపడుతోంది
X

ఈరోజు హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టినరోజు. చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. కానీ ఈ ఇస్మార్ట్ భామ మాత్రం చాలా బాధపడుతోంది. దీనికి ఓ కారణం ఉంది.

మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులుకు చాలా దగ్గర అయిపోయింది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నిధి ఈరోజు తన పుట్టినరోజును బెంగళూరులో తన నివాసంలోనే కుటుంబ సభ్యులు మధ్య జరుపుకుంటుంది.

సినీ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత తన పుట్టినరోజు సెట్స్ లోనే జరిగేదని, యూనిట్ సభ్యులు మధ్య కేక్ కటింగ్ సెలెబ్రేషన్స్ జరిగేవని, ప్రస్తుతం కరోనా కారణంగా తాను యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో సెట్స్ లో కేక్ కటింగ్ మిస్సయ్యానంటోంది ఈ భామ.

ప్రస్తుతం నిధి, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ లాంఛింగ్ మూవీలో నటిస్తోంది. అలానే తమిళ్ లో భూమి అనే చిత్రం చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని కొత్త కథలు వింటోంది. ఇక తాజాగా ఫేస్ బుక్ లో సరికొత్త రికార్డు సెట్ చేసింది నిధి. ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్స్ లో అత్యధికంగా 8.5 మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ తో నిధి మొదటి స్థానంలో నిలిచింది.

First Published:  16 Aug 2020 10:35 PM GMT
Next Story