Telugu Global
Cinema & Entertainment

ఈసారి పవన్ చూపు ఎవరిపై?

పైకి చెప్పకపోయినా పవన్ కొత్త సినిమా దాదాపు ఫిక్స్ అయింది. కెరీర్ లో 29వ చిత్రంగా రాబోతున్న ఆ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మించబోతున్నాడు. అయితే ఇప్పుడీ సినిమాను ఎవరు డైరక్ట్ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ముగ్గురు దర్శకులకు రామ్ తళ్లూరి అవకాశం ఇచ్చాడట. వాళ్లలో ముందువరుసలో ఉన్న వ్యక్తి డాలీ. గతంలో పవన్ తో గోపాల గోపాల సినిమా తీసిన అనుభవం ఇతడికి ఉంది. […]

ఈసారి పవన్ చూపు ఎవరిపై?
X

పైకి చెప్పకపోయినా పవన్ కొత్త సినిమా దాదాపు ఫిక్స్ అయింది. కెరీర్ లో 29వ చిత్రంగా రాబోతున్న ఆ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మించబోతున్నాడు. అయితే ఇప్పుడీ సినిమాను ఎవరు డైరక్ట్ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం ముగ్గురు దర్శకులకు రామ్ తళ్లూరి అవకాశం ఇచ్చాడట. వాళ్లలో ముందువరుసలో ఉన్న వ్యక్తి డాలీ. గతంలో పవన్ తో గోపాల గోపాల సినిమా తీసిన అనుభవం ఇతడికి ఉంది. పైగా పవన్ కు వ్యక్తిగతంగా చాలా క్లోజ్. సో.. మంచి కథ రాసుకుంటే డాలీకి మరో ఛాన్స్ ఇవ్వడానికి పవన్ కు ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇక డాలీతో పాటు లిస్ట్ లో గోపీచంద్ మలినేని, సురేందర్ రెడ్డి ఉన్నారు. వీళ్లలో సురేందర్ రెడ్డికి సైరా టైమ్ లో పవన్ తో కాస్త పరిచయం ఏర్పడింది. అదే టైమ్ లో పవన్ ఆలోచనల్ని కూడా తెలుకున్నాడు. కాబట్టి అతడి మైండ్ సెట్ కు తగ్గ కథ రాసే అవకాశం సురేందర్ రెడ్డికి దక్కింది. ఇక గోపీచంద్ ఎప్పట్లానే తనదైన స్టయిల్ లో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ రాసే పనిలో పడ్డాడు. ఈ ముగ్గురిలో పవన్ ఎవరి కథకు ఓటేస్తాడో చూడాలి.

First Published:  17 Aug 2020 7:00 AM GMT
Next Story