Telugu Global
National

చంద్రబాబు లేఖపై తేల్చేసిన జీవీఎల్‌

ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీకి చంద్రబాబు రాసిన లేఖపై రాజ్యసభ సభ్యుడు, దక్షిణ భారత బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదని తేల్చేశారు. వ్యవస్థల గురించి ఈ దేశంలో అందరి కంటే చంద్రబాబుకే బాగా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో పడితే ఆ విషయంలో జోక్యం చేసుకోదన్నారు. ప్రధానికి చంద్రబాబు లేఖ రాసినప్పటికీ… అసలు ఎవరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న […]

చంద్రబాబు లేఖపై తేల్చేసిన జీవీఎల్‌
X

ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీకి చంద్రబాబు రాసిన లేఖపై రాజ్యసభ సభ్యుడు, దక్షిణ భారత బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదని తేల్చేశారు. వ్యవస్థల గురించి ఈ దేశంలో అందరి కంటే చంద్రబాబుకే బాగా తెలుసన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో పడితే ఆ విషయంలో జోక్యం చేసుకోదన్నారు. ప్రధానికి చంద్రబాబు లేఖ రాసినప్పటికీ… అసలు ఎవరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న అంశాన్ని మాత్రం వివరించలేదన్నారు.

2015లో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వాయిస్‌ను అందరూ విన్నారని… అప్పుడు కూడా చంద్రబాబు ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు.

చంద్రబాబు ఫోన్లు ట్యాప్ అవుతుంటే కోర్టుకు వెళ్లాలి గాని కేంద్రానికి లేఖ రాస్తే ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. కోర్టులకు చంద్రబాబు సహకారం అవసరం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు కోర్టులకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని సలహా ఇచ్చారు.

చంద్రబాబునాయుడి అవినీతిపై లక్ష్మీపార్వతి 2005లో కేసు వేస్తే ఇప్పటికీ అది స్టే మీద ఉండిపోయిందని జీవీఎల్ గుర్తు చేశారు. 14ఏళ్ల పాటు చంద్రబాబు కేసుపై స్టే ఎలా ఇచ్చారన్నది చాలా ప్రాధాన్యత ఉన్న అంశమన్నారు. చంద్రబాబు కేసుపై ఇన్నేళ్ల పాటు స్టే ఉండడం గిన్నిస్ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కించాల్సిన అంశమని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

First Published:  18 Aug 2020 7:34 AM GMT
Next Story