Telugu Global
CRIME

రక్తపు మడుగులో అమ్మాయి... వీడియోలు తీసిన జనం!

మనిషిలో రాతి మనిషి తాలూకూ సహజసిద్ధమైన స్వభావం అలాగే ఉన్నదనడానికి ఇలాంటి సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకమ్మాయి గొంతు తెగి తీవ్రమైన రక్తస్రావంతో పడి ఉంటే… తమ ఫోనుల్లో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ… ఏం జరిగింది ఎవరు చేశారీపని అని ఆమెని ప్రశ్నలు వేస్తూ… అత్యంత హేయమైన రీతిలో ప్రవర్తించారు ఆమె చుట్టూ చేరిన జనం. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో జరిగిందీ ఘటన. ఆపదలో ఉన్న యువతిని వెంటనే హాస్పటల్ లో చేర్చకుండా పోలీసులు […]

రక్తపు మడుగులో అమ్మాయి... వీడియోలు తీసిన జనం!
X

మనిషిలో రాతి మనిషి తాలూకూ సహజసిద్ధమైన స్వభావం అలాగే ఉన్నదనడానికి ఇలాంటి సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకమ్మాయి గొంతు తెగి తీవ్రమైన రక్తస్రావంతో పడి ఉంటే… తమ ఫోనుల్లో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ… ఏం జరిగింది ఎవరు చేశారీపని అని ఆమెని ప్రశ్నలు వేస్తూ… అత్యంత హేయమైన రీతిలో ప్రవర్తించారు ఆమె చుట్టూ చేరిన జనం. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో జరిగిందీ ఘటన.

ఆపదలో ఉన్న యువతిని వెంటనే హాస్పటల్ లో చేర్చకుండా పోలీసులు వచ్చేవరకు చోద్యం చూశారు అక్కడ చేరినవారంతా. పోలీసులకు సమాచారం అంది వాళ్లు వచ్చి ఆమెని హాస్పటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది.

యువతి మెజిస్ట్రేట్ ఎదుట చెప్పిన వివరాల మేరకు పోలీసులు ఆమె అన్నను మరొక బంధువుని అరెస్టు చేశారు. తాను ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి తన కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించిందని… అందుకే వాళ్లు తనపై దాడి చేశారని ఆ అమ్మాయి పోలీసులకు తెలిపింది.

తాము వచ్చే వరకు యువతిని అక్కడే వదిలేయటం, ప్రజలు ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం… ఈ అంశాలపై పోలీసులు స్పందించారు. గాయపడినవారిని ఫొటోలు వీడియోలు తీయడం కాకుండా వెంటనే హాస్పటల్ కి తీసుకుని వెళ్లాలని, గాయపడిన తరువాత హాస్పటల్ కి చేరే లోపల ఉన్న సమమాన్ని గోల్డెన్ అవర్ అంటారని… ఆ సమయం బాధితుడు లేదా బాధితురాలు కోలుకోవటంలో చాలా కీలకమని సీనియర్ పోలీస్ అధికారి అవినాష్ పాండే అన్నారు. గాయపడినవారిని హాస్పటల్ కి తీసుకువచ్చేవారిని ఎలాంటి ప్రశ్నలు అడగరాదని సుప్రీం కోర్టు చెప్పిన సంగతిని సైతం ఆయన గుర్తు చేశారు.

గత నెలరోజుల్లో ఉత్తర ప్రదేశ్ లో మహిళలపై బాలికలపై జరుగుతున్న ఘాతుకాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం… స్త్రీలు, మహిళల సంరక్షణార్ధం ఒక ప్రత్యేక సంస్థని నెలకొల్పాలనే నిర్ణయం తీసుకుంది. అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది.

First Published:  18 Aug 2020 4:38 AM GMT
Next Story