Telugu Global
National

ఈసారి జడ్జి తండ్రిని లాయర్‌గా నియమించుకున్న అమరావతి వాదులు

ఏపీ రాజధాని వ్యవహారంలో మరోసారి సుప్రీం కోర్టులో అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ నారిమాన్ కూడా విచారణ నుంచి తప్పుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కుటుంబసభ్యులను అమరావతి తరపున లాయర్లుగా నియమించుకోవడమే ఇందుకు కారణం. ఈ కేసు విచారణ ఈనెల 17న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే బెంచ్‌ ముందుకు వచ్చింది. అమరావతి రైతుల తరపున సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తె రుక్మిణి బాబ్డే వాదిస్తున్న అంశాన్ని సీజే దృష్టికి ఒక న్యాయవాది తీసుకెళ్లారు. […]

ఈసారి జడ్జి తండ్రిని లాయర్‌గా నియమించుకున్న అమరావతి వాదులు
X

ఏపీ రాజధాని వ్యవహారంలో మరోసారి సుప్రీం కోర్టులో అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ నారిమాన్ కూడా విచారణ నుంచి తప్పుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కుటుంబసభ్యులను అమరావతి తరపున లాయర్లుగా నియమించుకోవడమే ఇందుకు కారణం.

ఈ కేసు విచారణ ఈనెల 17న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే బెంచ్‌ ముందుకు వచ్చింది. అమరావతి రైతుల తరపున సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తె రుక్మిణి బాబ్డే వాదిస్తున్న అంశాన్ని సీజే దృష్టికి ఒక న్యాయవాది తీసుకెళ్లారు. దాంతో విచారణ నుంచి తప్పుకున్న బాబ్డే… మరో బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని ఆదేశించారు.

నేడు కేసు జస్టిస్ రోహింటన్ నారిమాన్‌ బెంచ్‌ ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా అమరావతి తరపున జస్టిస్ నారిమాన్ తండ్రి పాలి నారిమాన్‌ను లాయర్‌గా నియమించుకున్నారు. ఈ విషయాన్ని బెంచ్‌ దృష్టికి కొందరు తీసుకెళ్లారు. నారిమాన్ కూడా కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది.

First Published:  19 Aug 2020 7:25 AM GMT
Next Story