Telugu Global
National

రాజధానిపై మరోసారి కేంద్రం అఫిడవిట్

ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఈనెల 6న హైకోర్టులో అఫిడవిట్ వేసిన కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీ హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందంటూ ఇటీవల దాఖలైన ప్రత్యేక పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో కూడా రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనని తేల్చేసింది. రాజధాని […]

రాజధానిపై మరోసారి కేంద్రం అఫిడవిట్
X

ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఈనెల 6న హైకోర్టులో అఫిడవిట్ వేసిన కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీ హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది.

రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందంటూ ఇటీవల దాఖలైన ప్రత్యేక పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో కూడా రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టం చేసింది.

రాజధాని ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనని తేల్చేసింది. రాజధాని విషయానికి సంబంధించి చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తాజా అఫిడవిట్‌లో కూడా తేల్చిచెప్పింది. అభివృద్ది వికేంద్రీకరణ చట్టం అమలుపై ఈనెల 27 వరకు హైకోర్టు స్టే ఇచ్చింది.

First Published:  19 Aug 2020 8:53 AM GMT
Next Story