Telugu Global
Cinema & Entertainment

సింగర్ సునీతకు కరోనా.. కానీ..!

సీనియర్ సింగర్ సునీతకు కరోనా సోకిందనే విషయం ఒక్కసారిగా బ్రేక్ అయింది. దీంతో ఎవరికి నచ్చినట్టు వాళ్లు కథనాలు రాసేసుకున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. సునీతకు దాదాపు 2 వారాల కిందటే కరోనా వచ్చింది. వచ్చి తగ్గిపోయింది కూడా. ఈ విషయాన్ని స్వయంగా సునీత వెల్లడించింది. ఓ రికార్డింగ్ స్టుడియోలో రికార్డింగ్ చేస్తున్న టైమ్ లో సునీతకు తలనొప్పి వచ్చిందట. నిజానికి తలనొప్పి వస్తే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సునీత మాత్రం […]

సింగర్ సునీతకు కరోనా.. కానీ..!
X

సీనియర్ సింగర్ సునీతకు కరోనా సోకిందనే విషయం ఒక్కసారిగా బ్రేక్ అయింది. దీంతో ఎవరికి నచ్చినట్టు వాళ్లు కథనాలు రాసేసుకున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. సునీతకు దాదాపు 2 వారాల కిందటే కరోనా వచ్చింది. వచ్చి తగ్గిపోయింది కూడా. ఈ విషయాన్ని స్వయంగా సునీత వెల్లడించింది.

ఓ రికార్డింగ్ స్టుడియోలో రికార్డింగ్ చేస్తున్న టైమ్ లో సునీతకు తలనొప్పి వచ్చిందట. నిజానికి తలనొప్పి వస్తే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సునీత మాత్రం వయసుమళ్లిన తన తల్లిదండ్రుల్ని దృష్టిలో పెట్టుకొని కరోనా పరీక్ష చేయించుకుందట. దురదృష్టవశాత్తూ టెస్టులో పాజిటివ్ అని వచ్చింది.

అలా పాజిటివ్ అని తెలిసిన వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయానని, వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకున్నానని తెలిపిన సునీత.. ప్రస్తుతం తను కరోనా నుంచి పూర్తిగా బయటపడినట్టు ప్రకటించింది. ఇకపై తనకు కరోనా సోకిందని వార్తలు రాసేముందు.. ఆ వైరస్ తగ్గిందనే విషయాన్ని కూడా ప్రస్తావించాలని అంటోంది ఈ గాయని.

First Published:  19 Aug 2020 10:22 AM GMT
Next Story