Telugu Global
Cinema & Entertainment

వికారాబాద్ అడవుల్లో వైష్ణవ్ తేజ్

బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇదే ఎడ్వాంటేజ్. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఆఫర్లు వస్తుంటాయి. కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే బిజీ అయిపోవచ్చు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ విషయంలో ఇదే జరుగుతోంది. అతడు నటించిన ఉప్పెన సినిమా ఇంకా థియేటర్లలోకి రాలేదు. అయితేనేం, అప్పుడే తన రెండో సినిమా స్టార్ట్ చేశాడు. షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. క్రిష్ దర్శకత్వంలో ఓ యాక్షన్-మిస్టరీ ఎంటర్ టైనర్ స్టార్ట్ చేశాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా […]

వికారాబాద్ అడవుల్లో వైష్ణవ్ తేజ్
X

బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇదే ఎడ్వాంటేజ్. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఆఫర్లు వస్తుంటాయి. కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే బిజీ అయిపోవచ్చు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ విషయంలో ఇదే జరుగుతోంది. అతడు నటించిన ఉప్పెన సినిమా ఇంకా థియేటర్లలోకి రాలేదు. అయితేనేం, అప్పుడే తన రెండో సినిమా స్టార్ట్ చేశాడు. షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు.

క్రిష్ దర్శకత్వంలో ఓ యాక్షన్-మిస్టరీ ఎంటర్ టైనర్ స్టార్ట్ చేశాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ఇలా లాంఛ్ అవ్వడం, అలా సెట్స్ పైకి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం వికారాబాద్ అటవీప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ పై షూటింగ్ చేస్తున్నారు. వచ్చేనెల నుంచి హీరోయిన్ రకుల్ జాయిన్ అవుతుంది. ఈ సినిమాను 40 రోజుల సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేయబోతున్నారు. వికారాబాద్ లో నెల రోజులు.. నల్లమల అడవుల్లో ఓ 10 రోజులు షూట్ చేసి సినిమాను పూర్తిచేస్తాడు క్రిష్. ఆ తర్వాత తిరిగి పవన్ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతాడు.

First Published:  18 Aug 2020 8:30 PM GMT
Next Story