Telugu Global
Cinema & Entertainment

డబుల్ ఇస్మార్ట్ వచ్చేస్తోంది

ఇస్మార్ట్ శంకర్.. కేవలం హీరో రామ్ కు మాత్రమే కాదు, దర్శకుడు పూరి జగన్నాధ్ కు కూడా ఎంతో ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాతో ఈ ఇద్దరు తమ ఫ్లాపులకు బ్రేక్ వేశారు. రామ్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటే.. పూరి మరోసారి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం పూరి ఇంత బిజీగా ఉన్నాడంటే దానికి కారణం ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ కు […]

డబుల్ ఇస్మార్ట్ వచ్చేస్తోంది
X

ఇస్మార్ట్ శంకర్.. కేవలం హీరో రామ్ కు మాత్రమే కాదు, దర్శకుడు పూరి జగన్నాధ్ కు కూడా ఎంతో ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాతో ఈ ఇద్దరు తమ ఫ్లాపులకు బ్రేక్ వేశారు. రామ్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటే.. పూరి మరోసారి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం పూరి ఇంత బిజీగా ఉన్నాడంటే దానికి కారణం ఇస్మార్ట్ శంకర్.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా తీస్తానని గతంలోనే పూరి జగన్నాధ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ లాక్ డౌన్ టైమ్ లో డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ పూర్తిచేశాడు పూరి. ఇక ఆ స్క్రిప్ట్ ను రామ్ కు వినిపించడమే ఆలస్యం.

రామ్ కూడా ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు. రెడ్ సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తిచేశాడు. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో.. డబుల్ ఇస్మార్ట్ స్టోరీలైన్ నచ్చితే పూరితో కలిసి రామ్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ భారీ సినిమా చేస్తున్నాడు పూరి.

First Published:  21 Aug 2020 7:00 AM GMT
Next Story