Telugu Global
National

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 19 మంది సిబ్బంది అక్కడ ఉన్నారు. 8 మంది బయటకు పరుగులు తీస్తూ వచ్చారు. మరో 11 మంది లోపలే ఉన్నట్టు చెబుతున్నారు. లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు. మొదటి టర్నినల్‌లోనే ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు అలముకోవడంతో రెస్క్యూ పనులకు ఇబ్బందిగా […]

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
X

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 19 మంది సిబ్బంది అక్కడ ఉన్నారు. 8 మంది బయటకు పరుగులు తీస్తూ వచ్చారు. మరో 11 మంది లోపలే ఉన్నట్టు చెబుతున్నారు.

లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు. మొదటి టర్నినల్‌లోనే ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు అలముకోవడంతో రెస్క్యూ పనులకు ఇబ్బందిగా మారింది.

లోపల చిక్కుకున్న వారిలో ఏడుగురు జెన్‌కో సిబ్బంది, మరో ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులున్నారు. డీఈ శ్రీనివాస్ గౌడ్, సుందర్, మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, రాంబాబు, కిరణ్‌, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది గల్లంతు అయ్యినట్లు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న తర్వాత తెలంగాణ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తెలంగాణ వైపు ఉన్న ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగల వల్ల సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని… లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది లోపలికి వెళ్లారని మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు. కానీ దట్టంగా పొగ వల్ల మూడుసార్లు రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లి వెనక్కి వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో సిబ్బంది లోపలికి వెళ్లారు.

First Published:  20 Aug 2020 8:56 PM GMT
Next Story