Telugu Global
CRIME

ఇంత ప్రేమ భరించలేను... విడాకులు కావాలి !

సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనుమానాలు, అపోహలు లాంటివి పెరిగిపోతే… అవి భరించలేని స్థాయికి చేరితే విడాకులు కోరుకుంటారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని శంభాల్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త తనపై చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేకపోతున్నానని… విడాకులిప్పించండి అంటూ కోర్టుకెళ్లింది. పెళ్లయిన పద్దెనిమిది నెలల అనంతరం ఆ మహిళ షరియా కోర్టుకి విడాకులకోసం అప్లయి చేసింది. కోర్టులో విడాకులకు కారణాలు చెబుతూ… అతను తనతో ఎలాంటి సందర్భంలోనూ గొడవ పడటం లేదని, […]

ఇంత ప్రేమ భరించలేను... విడాకులు కావాలి !
X

సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనుమానాలు, అపోహలు లాంటివి పెరిగిపోతే… అవి భరించలేని స్థాయికి చేరితే విడాకులు కోరుకుంటారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని శంభాల్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త తనపై చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేకపోతున్నానని… విడాకులిప్పించండి అంటూ కోర్టుకెళ్లింది.

పెళ్లయిన పద్దెనిమిది నెలల అనంతరం ఆ మహిళ షరియా కోర్టుకి విడాకులకోసం అప్లయి చేసింది. కోర్టులో విడాకులకు కారణాలు చెబుతూ… అతను తనతో ఎలాంటి సందర్భంలోనూ గొడవ పడటం లేదని, తనమీద కోపంగా అరవటం లేదా తనని నిరాశకు గురిచేయటం కానీ చేయలేదని, కొన్నిసార్లు తనే వంట చేసి పెడతాడని, ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తాడని… అతని ప్రేమ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తోందని, తట్టుకోలేకపోతున్నానని ఆమె తెలిపింది.

‘నేనేదైనా పొరబాటు చేసినా ఆయన క్షమించేస్తున్నాడు. నాకు తనతో వాదించాలని ఉంటుంది. కానీ అది కూడా కుదరటం లేదు. అన్నింటికీ అంగీకరించే భర్తతో ఇమడలేకపోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చిందామె. విడాకులు కోరడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా… అంటే లేవని చెప్పింది.

ఆమె సంగతి ఇలా ఉంటే… ఆమె భర్త మాత్రం తన భార్యను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని తాను కోరుకున్నట్టుగా కోర్టుకి తెలిపాడు. ఆ కేసుని తిప్పిపంపాల్సిందిగా కోర్టుని అభ్యర్థించాడు.

ఇలాంటి విషయాలకు విడాకులు మంజూరు చేయటం కుదరదంటూ భార్యాభర్తలు ఇరువురు పరస్పర అంగీకారంతో తమ సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా కోర్టు వారికి సూచించింది. కోర్టు ద్వారా తన కోరిక నెరవేరకపోవటంతో ఆమె స్థానిక పంచాయితీలో భర్తపై ఫిర్యాదు చేసి విడాకులు కోరింది. అయితే అక్కడ కూడా ఆమె కోరిక నెరవేరలేదు. గ్రామ పంచాయితీ కూడా ఆమె చేస్తున్న ఫిర్యాదులతో విడాకులు ఇప్పించలేమని చెప్పింది.

First Published:  21 Aug 2020 5:10 AM GMT
Next Story