Telugu Global
Health & Life Style

తల్లిపాల ద్వారా బిడ్డకు కరోనా సోకుతుందా?!

తల్లికి కరోనా ఉన్నపుడు ఆమె పాలు తాగిన బిడ్డకు వైరస్ సోకుతుందా… ఈ విషయంపైన నిర్వహించిన అధ్యయనంలో  అలాంటి ప్రమాదమేమీ ఉండదని తేలింది. మమ్మీస్ మిల్క్ అనే… హ్యూమన్ మిల్క్ పరిశోధనా సంస్థ నుండి సేకరించిన 64 తల్లిపాల శాంపిళ్లను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయం వెల్లడించారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ఈ అధ్యయన వివరాలు ప్రచురించారు.  కరోనా బారిన పడిన 18 మంది తల్లులనుండి 64 శాంపిళ్లను సేకరించి వాటిపై శాస్త్రవేత్తలు […]

తల్లిపాల ద్వారా బిడ్డకు కరోనా సోకుతుందా?!
X

తల్లికి కరోనా ఉన్నపుడు ఆమె పాలు తాగిన బిడ్డకు వైరస్ సోకుతుందా… ఈ విషయంపైన నిర్వహించిన అధ్యయనంలో అలాంటి ప్రమాదమేమీ ఉండదని తేలింది. మమ్మీస్ మిల్క్ అనే… హ్యూమన్ మిల్క్ పరిశోధనా సంస్థ నుండి సేకరించిన 64 తల్లిపాల శాంపిళ్లను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయం వెల్లడించారు.

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ఈ అధ్యయన వివరాలు ప్రచురించారు. కరోనా బారిన పడిన 18 మంది తల్లులనుండి 64 శాంపిళ్లను సేకరించి వాటిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. తల్లుల్లో కరోనా పాజిటివ్ ఉన్నా అది తల్లిపాల ద్వారా బిడ్డకు చేరలేకపోవటం పరిశోధకులు గుర్తించారు.

వైరస్ తాలూకూ ఆర్ ఎన్ ఎ… తీవ్రంగా పెరుగుతున్నపుడు మాత్రమే ఇన్ ఫెక్షన్ ని కలిగిస్తుందని, తాము పరిశీలించిన శాంపిళ్లలో అలాంటిదేమీ కనిపించలేదని, దీనిని బట్టి వైరస్ సోకిన తల్లుల ద్వారా… పాలనుండి మాత్రం బిడ్డలకు అది సోకదని చెప్పవచ్చని అధ్యయన నిర్వాహకుల్లో ఒకరైన క్రిస్టినా చాంబర్స్ అంటున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి వెలువరించిన నివేదికలో ఆమె ఈ వివరాలు తెలిపారు. వైరస్ సోకని మహిళలనుండి సేకరించిన పాలలో వైరస్ ని కలిపినా… వాటిలో ఇన్ ఫెక్షన్ తాలూకూ లక్షణాలు కనిపించలేదు.

అయితే తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు మాస్క్ ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం మర్చిపోకూడదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.

First Published:  21 Aug 2020 8:37 PM GMT
Next Story