Telugu Global
Cinema & Entertainment

నా ప్రాణదాత చిరంజీవి

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నాగబాబు యూట్యూబ్ కెక్కారు. “అంతా నా ఇష్టం” అంటూ యూట్యూబ్ లో మాట్లాడే నాగబాబు.. ఈసారి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాస్త ఎక్కువగానే మాట్లాడారు. దశలవారీగా వీడియోలు రిలీజ్ చేస్తూ.. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని, తీపిగుర్తుల్ని షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఏకంగా తన ప్రాణదాతగా చెప్పుకొచ్చారు. “చిన్నప్పుడు నేను, అన్నయ్య మొగల్తూరులో చిన్న ఏరు దాటుతున్నాం. బల్ల కట్టుపై నిల్చున్నాం. నాకు నీళ్లంటే చాలా భయం. ఎందుకంటే నాకు ఈత […]

నా ప్రాణదాత చిరంజీవి
X

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నాగబాబు యూట్యూబ్ కెక్కారు. “అంతా నా ఇష్టం” అంటూ యూట్యూబ్ లో మాట్లాడే నాగబాబు.. ఈసారి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాస్త ఎక్కువగానే మాట్లాడారు. దశలవారీగా వీడియోలు రిలీజ్ చేస్తూ.. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని, తీపిగుర్తుల్ని షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఏకంగా తన ప్రాణదాతగా చెప్పుకొచ్చారు.

“చిన్నప్పుడు నేను, అన్నయ్య మొగల్తూరులో చిన్న ఏరు దాటుతున్నాం. బల్ల కట్టుపై నిల్చున్నాం. నాకు నీళ్లంటే చాలా భయం. ఎందుకంటే నాకు ఈత రాదు. అనుకోకుండా బల్లకట్టు పైనుంచి ఏరులో పడిపోయాను. వెంటనే చిరంజీవి తడుముకోకుండా నీట్లో దూకేశారు. నన్ను కాపాడారు. అప్పుడు చిరంజీవి నన్ను రక్షించకపోయి ఉంటే, ఇప్పుడిలా నేను కనిపించేవాడ్ని కాదు. అందుకే ఆయన నాకు అన్నయ్య మాత్రమే కాదు, ప్రాణదాత కూడా.”

ఇలా చిరంజీవి గురించి ఎన్నో విషయాల్ని బయటపెట్టారు నాగబాబు. చిరంజీవి హీరో అయిన తర్వాత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ రాలేదని.. కాలేజీ రోజుల నుంచే చిరంజీవికి చాలా అభిమానులు ఉండేవారని చెప్పుకొచ్చారు నాగబాబు.

First Published:  22 Aug 2020 9:29 AM GMT
Next Story