Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి ముద్దుపేరు ఏంటో తెలుసా?

అభిమానులంతా ఆప్యాయంగా అన్నయ్య అని పిలుచుకుంటారు. ఇండస్ట్రీ జనాలంతా మెగాస్టార్ అంటారు. తల్లి అంజనాదేవి శంకర్ బాబు అంటుంది. మరి చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి క్లాస్ మేట్స్ అతడ్ని ఏమని పిలిచేవారు. సరిగ్గా ఇక్కడే చిరంజీవికి ఓ ప్రత్యేకమైన పేరు పుట్టుకొచ్చింది. అదే కేఎస్వీ. అవును.. చిరంజీవికి ఉన్న నిక్ నేమ్స్ లో కేఎస్వీ కూడా ఒకటి. చిరంజీవి స్క్రీన్ నేమ్ తో, రియల్ నేమ్ తో అస్సలు సంబంధం లేని ఈ పేరు చిరంజీవికి […]

చిరంజీవి ముద్దుపేరు ఏంటో తెలుసా?
X

అభిమానులంతా ఆప్యాయంగా అన్నయ్య అని పిలుచుకుంటారు. ఇండస్ట్రీ జనాలంతా మెగాస్టార్ అంటారు. తల్లి అంజనాదేవి శంకర్ బాబు అంటుంది. మరి చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి క్లాస్ మేట్స్ అతడ్ని ఏమని పిలిచేవారు.

సరిగ్గా ఇక్కడే చిరంజీవికి ఓ ప్రత్యేకమైన పేరు పుట్టుకొచ్చింది. అదే కేఎస్వీ. అవును.. చిరంజీవికి ఉన్న నిక్ నేమ్స్ లో కేఎస్వీ కూడా ఒకటి. చిరంజీవి స్క్రీన్ నేమ్ తో, రియల్ నేమ్ తో అస్సలు సంబంధం లేని ఈ పేరు చిరంజీవికి ఎలా వచ్చిందబ్బా?

ఈ ముద్దుపేరు వెనక గమ్మత్తైన మేటర్ ను నాగబాబు బయటపెట్టారు.

“అన్నయ్యకు రకరకాల పేర్లు ఉండేవి. అమ్మ-నాన్న శంకర్ బాబు అని పిలిచేవారు. పూర్తిపేరు కొణెదల శివశంకర వరప్రసాద్. అంతపెద్ద పేరు పిలవలేక కేఎస్ఎస్వీ ప్రసాద్ అని పిలిచేవారు. కొన్నాళ్లకు ఆ ప్రసాద్ అనేది కూడా పోయింది. కేఎస్ఎస్వీ అని పిలిచేవారు. మరికొన్నాళ్లకు ఫ్లోలో అదే పేరు కేఎస్వీగా మారిపోయింది. అంతా కేఎస్వీ అనే పిలిచేవారు”

ఇలా చిరంజీవికి కాలేజ్ డేస్ లో కేఎస్వీ అనే పేరు కూడా ఉండేదనే విషయాన్ని బయటపెట్టారు నాగబాబు.

First Published:  23 Aug 2020 8:58 PM GMT
Next Story