Telugu Global
Cinema & Entertainment

ఈసారి సంక్రాంతి కూడా ఈమెదే

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసారి సంక్రాంతికి కూడా పూజా హెగ్డేనే హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. అవును.. ఆమె నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇదే కనుక జరిగితే అఖిల్ తొలిసారిగా సంక్రాంతి హీరో అవుతాడు.. పూజా హెగ్డే మరోసారి సంక్రాంతి భామ అవుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన అల వైకుంఠపురములో సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైంది. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాహుబలి-2 […]

ఈసారి సంక్రాంతి కూడా ఈమెదే
X

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసారి సంక్రాంతికి కూడా పూజా హెగ్డేనే హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. అవును.. ఆమె నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇదే కనుక జరిగితే అఖిల్ తొలిసారిగా సంక్రాంతి హీరో అవుతాడు.. పూజా హెగ్డే మరోసారి సంక్రాంతి భామ అవుతుంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన అల వైకుంఠపురములో సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైంది. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాహుబలి-2 తర్వాత ఇదే పెద్ద హిట్. అంత పెద్ద హిట్ తర్వాత మళ్లీ పూజా హెగ్డే సినిమా సంక్రాంతికే సిద్ధమవ్వడం కాకతాళీయం మాత్రమే. ఎందుకంటే.. ఈపాటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ థియేటర్లలోకి రావాలి.

లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల్లానే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అలా ఆగిపోయిన ఈ సినిమాను వచ్చేనెల నుంచి మొదలుపెట్టి, సంక్రాంతికి సిద్ధం చేయాలనేది ప్లాన్. నిజానికి ఈ సంక్రాంతికి వకీల్ సాబ్, రెడ్, శ్రీకారం లాంటి సినిమాలు అనుకుంటున్నారు. మరి ఈ రేసులోకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా చేరుతుందా లేదా అనేది చూడాలి.

First Published:  24 Aug 2020 10:00 AM GMT
Next Story