Telugu Global
National

ఫోన్ ట్యాపింగ్ కి చంద్రబాబే ఆద్యుడు... కుండబద్దలు కొట్టిన వీర్రాజు...

రాష్ట్రంలో సెల్ ఫోన్ సంభాషణలు ట్యాపింగ్ కి గురవుతున్నాయని, న్యాయమూర్తులు, జర్నలిస్ట్ లు, ప్రతిపక్ష నాయకుల మాటల్ని ప్రభుత్వం దొంగచాటుగా వింటోందని ఏకంగా ప్రధానికి లేఖ రాసి సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. అయితే చంద్రబాబే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఆద్యుడని కుండబద్దలు కొట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇలాంటి నీఛ సంప్రదాయాన్ని బాబే ఏపీకి తీసుకొచ్చారని అన్నారు. ఇతర దేశాలనుంచి కొన్ని పరికరాలను తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని చెప్పారు. […]

ఫోన్ ట్యాపింగ్ కి చంద్రబాబే ఆద్యుడు... కుండబద్దలు కొట్టిన వీర్రాజు...
X

రాష్ట్రంలో సెల్ ఫోన్ సంభాషణలు ట్యాపింగ్ కి గురవుతున్నాయని, న్యాయమూర్తులు, జర్నలిస్ట్ లు, ప్రతిపక్ష నాయకుల మాటల్ని ప్రభుత్వం దొంగచాటుగా వింటోందని ఏకంగా ప్రధానికి లేఖ రాసి సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు.

అయితే చంద్రబాబే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఆద్యుడని కుండబద్దలు కొట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇలాంటి నీఛ సంప్రదాయాన్ని బాబే ఏపీకి తీసుకొచ్చారని అన్నారు. ఇతర దేశాలనుంచి కొన్ని పరికరాలను తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని చెప్పారు.

గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు సొంత పార్టీ నేతల కాల్స్ కూడా దొంగచాటుగా వినేవారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు వీర్రాజు. రెండు ఉదాహరణలు కూడా చెప్పారాయన.

“మీకు ఎవరో నక్సలైట్ నుంచి తరచూ ఫోన్లు వస్తున్నాయి, అలాంటి వారితో మాట్లాడితే ఇబ్బందుల్లో పడతారు, మీ పేరు చెప్పి వారు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారు, ఈసారి ఫోన్ వస్తే మాకు సమాచారం ఇవ్వండి..” అంటూ ఓ సందర్భంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సదరు వెంకటేశ్వరరావు వీర్రాజుకి చెప్పారట.

అప్పట్లో టీడీపీకి తాము మిత్రపక్షంగా ఉండేవారమని, అప్పుడే తమ ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. టీడీపీనుంచి బీజేపీలో చేరిన ఓ సీనియర్ నేత ఫోన్ కాల్స్ కూడా ఆయన టీడీపీలో ఉన్నప్పుడే ట్యాప్ చేశారని ఆరోపించారు. మీరు వీర్రాజుతో ఎక్కువగా మాట్లాడుతున్నారు అని ఆ నాయకుడితో ఏబీ వెంకటేశ్వరరావు చెప్పడంతో.. ఆయన ఓ ప్రైవేట్ నెంబర్ నుంచి తనకి ఫోన్లు చేసేవారని వివరించారు.

ఫోన్ ట్యాపింగ్ పరికరాలను విదేశాలనుంచి తెప్పించి, ఫోన్ కాల్స్ ని రహస్యంగా విన్న చంద్రబాబు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరమని అన్నారు. విచారణ చేయాల్సి వస్తే చంద్రబాబు హయాంలో జరిగిన సంఘటనలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది.

చంద్రబాబు సొంత పార్టీ నేతలపై కూడా ఎలాంటి నిఘా పెట్టేవారో బయటపడింది. ఇలాంటి వ్యవహారాలకోసం పోలీస్ వ్యవస్థని వాడుకోవడం మరీ దారుణం. పలు ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావుని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సరైన చర్యేనని పరోక్షంగా వీర్రాజు సమర్థించినట్లయింది. రాష్ట్ర పోలీసులు వీర్రాజు వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే.. విచారణ చంద్రబాబు దగ్గరనుంచే మొదలు కావాల్సి ఉంటుంది. మరి వీర్రాజు ఆరోపణలపై చంద్రబాబు ఏమని స్పందిస్తారో చూడాలి.

First Published:  23 Aug 2020 8:51 PM GMT
Next Story