Telugu Global
International

భారీగా ఉత్పత్తి పెంచడమే ప్రమాదానికి కారణమా ?

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. సీఐడీ దర్యాప్తు మొదలుపెట్టింది. ప్రమాదానికి కారణం భారీగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. జులై 19 నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించగా రోజురోజుకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ వచ్చారు. ప్రమాదం జరిగిన రోజు 21.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రమాదం జరిగే సమయానికి అప్పటికే 19. 25 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ప్లాంట్‌పై ఒత్తిడి అంశాలను పరిగణలోకి […]

భారీగా ఉత్పత్తి పెంచడమే ప్రమాదానికి కారణమా ?
X

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. సీఐడీ దర్యాప్తు మొదలుపెట్టింది. ప్రమాదానికి కారణం భారీగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

జులై 19 నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించగా రోజురోజుకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ వచ్చారు. ప్రమాదం జరిగిన రోజు 21.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

ప్రమాదం జరిగే సమయానికి అప్పటికే 19. 25 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ప్లాంట్‌పై ఒత్తిడి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా భారీగా ఉత్పత్తి పెంచుతూ వెళ్లడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

కుడిగట్టున ఉన్న ఏపీ పవర్ ప్లాంట్‌లో మాత్రం సాధారణంగానే ఉత్పత్తి కొనసాగుతోందని… కానీ ఎడమగట్టు కేంద్రంలో ఇలా భారీగా ఉత్పత్తి పెంచాల్సిందిగా ఎవరు ఆదేశాలు ఇచ్చి ఉంటారన్న దానిపైనా చర్చ జరుగుతోంది.

ప్రమాదం జరిగినప్పుడు స్మోక్ అలారం కూడా మోగలేదని చెబుతున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్‌ సుందరం ఫైర్ అలారంను మ్యానువల్‌గా మోగించారని… ఆ ప్రయత్నంలోనే ఆయన చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఆటోమేటిక్‌గా అలారం ఎందుకు మోగలేదు అన్న దానిపై చర్చిస్తున్నారు.

మొత్తం ఆరు యూనిట్లలో నాలుగు యూనిట్లు బాగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఆటో సిస్టంతో పనిచేసే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా ఆన్‌ కాకపోవడంతో పొగ వ్యాపించిందని చెబుతున్నారు. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌లు పనిచేసి ఉంటే పొగ అంతా నిమిషాల వ్యవధిలోనే బయటకుపోయేదని… దాని వల్ల సిబ్బంది ప్రాణాలు దక్కేవంటున్నారు.

సాధారణంగా బ్యాటరీలను పవర్‌ జనరేషన్‌ లేని సమయంలో మారుస్తుంటారు. ఈసారి మాత్రం ఒకవైపు పవర్ జనరేషన్ జరుగుతుండగానే బ్యాటరీలు మార్చే ప్రయత్నం చేశారు. ఒకేసారి వందలాది బ్యాటరీలను మార్చారు. అలా బ్యాటరీలను అమర్చిన ఐదు నిమిషాలకే ప్రమాదం జరిగింది. అప్పటికప్పుడు అమర్చిన బ్యాటరీలు సరిగా పనిచేయకపోవడంతోనే డీసీ మెయింటనెన్స్ విఫలమై ప్రమాదం సంబంధించినట్టు అంచనా వేస్తున్నారు.

First Published:  23 Aug 2020 10:51 PM GMT
Next Story