Telugu Global
National

కరోనా ఎఫెక్ట్... సగానికి తగ్గిన అంటువ్యాధులు

కరోనా కారణంగా ఇతర జబ్బులు బాగా తగ్గిపోయాయి. మనుషులు వ్యక్తిగత శుభ్రత పాటిస్తుండడం, గుంపులుగా ఉండకపోవడం వంటి వాటి వల్ల ఇతర జబ్బులు భారీగా తగ్గాయి. దీనికి తోడు కరోనా నేపథ్యంలో పదేపదే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అంటువ్యాధులు తగ్గిపోయాయి. గతేడాది జూన్‌, జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మలేరియా కేసులు సగానికి తగ్గిపోయాయి. డెంగీ కేసులు కేవలం 10 నుంచి 20 శాతానికి పరిమితం అయ్యాయని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ పరిశీలనలో […]

కరోనా ఎఫెక్ట్... సగానికి తగ్గిన అంటువ్యాధులు
X

కరోనా కారణంగా ఇతర జబ్బులు బాగా తగ్గిపోయాయి. మనుషులు వ్యక్తిగత శుభ్రత పాటిస్తుండడం, గుంపులుగా ఉండకపోవడం వంటి వాటి వల్ల ఇతర జబ్బులు భారీగా తగ్గాయి. దీనికి తోడు కరోనా నేపథ్యంలో పదేపదే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అంటువ్యాధులు తగ్గిపోయాయి.

గతేడాది జూన్‌, జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మలేరియా కేసులు సగానికి తగ్గిపోయాయి. డెంగీ కేసులు కేవలం 10 నుంచి 20 శాతానికి పరిమితం అయ్యాయని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ పరిశీలనలో వెల్లడైంది.

గతేడాది ఈ మూడు నెలల కాలంలో రాష్ట్రంలో 1,163 మలేరియా కేసులు నమోదు కాగా… ఈ సారి కేవలం 601 మాత్రమే నమోదు అయ్యాయి. డెంగీ కేసులు గతేడాది ఈ మూడు నెలల కాలంలో 944 నమోదు కాగా ఈసారి 24 మాత్రమే వచ్చాయి.

గతేడాది లక్షా 11వేల685 డయేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది మూడు నెలల కాలంలో20వేల 355 మాత్రమే నమోదు అయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. టైపాయిడ్ కేసులు ఈ ఏడాది మూడు నెలల కాలంలో 355 మాత్రమే నమోదు అయ్యాయి. అదే గతేడాది ఈ మూడు నెలల కాలానికి 9వేల 528 నమోదు అయినట్టు ఏపీ పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో పెద్దెత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం వల్లే ఇతర జబ్బులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. బ్లీచింగ్‌ చల్లడం, ఫామింగ్‌ చేయడం, క్లోరినేషన్ వంటిచర్యలు ఎక్కువగా చేయడం వల్ల ఇతర జబ్బుల బెడద తగ్గిందంటున్నారు.

First Published:  24 Aug 2020 9:09 PM GMT
Next Story