Telugu Global
National

కరోనా బిజినెస్ పై జగన్ కన్నెర్ర...

ప్రజల్లో కరోనా భయం రోజురోజుకీ పెరుగుతున్న వేళ.. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ కూడా దినదిన ప్రవర్థమానం అవుతోంది. ప్రజల బలహీనత, మరణ భయాన్నే పెట్టుబడిగా యాజమాన్యాలు కరోనా వైద్యం పేరుతో దోచుకుంటున్నాయి. కొవిడ్ కేర్ సెంటర్లు నిర్వహించే ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రోజుకి 3500, వాస్తవంలో 35వేల రూపాయలనుంచి లక్ష రూపాయల వలకు కార్పొరేట్ ఆస్పత్రులు ప్యాకేజీలు పెట్టి మరీ ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పలు ఫిర్యాదులు అందడంతో.. సీఎం జగన్ […]

కరోనా బిజినెస్ పై జగన్ కన్నెర్ర...
X

ప్రజల్లో కరోనా భయం రోజురోజుకీ పెరుగుతున్న వేళ.. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ కూడా దినదిన ప్రవర్థమానం అవుతోంది. ప్రజల బలహీనత, మరణ భయాన్నే పెట్టుబడిగా యాజమాన్యాలు కరోనా వైద్యం పేరుతో దోచుకుంటున్నాయి.

కొవిడ్ కేర్ సెంటర్లు నిర్వహించే ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రోజుకి 3500, వాస్తవంలో 35వేల రూపాయలనుంచి లక్ష రూపాయల వలకు కార్పొరేట్ ఆస్పత్రులు ప్యాకేజీలు పెట్టి మరీ ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నాయి.

దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పలు ఫిర్యాదులు అందడంతో.. సీఎం జగన్ స్వయంగా అధికారులకు సూచన చేశారు. కరోనా వైద్యానికి అధికంగా ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ బాధ్యతను కలెక్టర్లు, ఎస్పీలపై పెట్టారు. అయితే వాస్తవంలో ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

నిబంధనలకోసం సాధారణ వార్డు, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు గుంజడంకోసం ప్రత్యేక వార్డులు ప్రతి ఆస్పత్రిలోనూ ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు కట్టినా, ఉచితంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరినా వైద్యం ఒకటే. విటమిన్ ట్యాబ్లెట్లు, వేడినీరు, పౌష్టికాహారం అందరికీ ఇస్తున్నారు. అత్యవసరం అయితే ఆక్సిజన్ సిలిండర్ పెట్టడానికి, వెంటిలేటర్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వాసుపత్రుల్లో కూడా వసతి ఉంది. కానీ చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులవైపే మొగ్గు చూపుతున్నారు. ఎంత రేటెక్కువైతే అంత నాణ్యమైన వైద్యం అందుతుందనే భ్రమలో కార్పొరేట్ ఆస్పత్రులవైపు పరుగులు తీస్తున్నారు.

ఈ దశలో ప్రభుత్వం అదిలింపులకి, బెదిరింపులకి కార్పొరేట్ ఆస్పత్రులు లొంగే అవకాశాలు తక్కువ. అయితే కార్పొరేట్ ఆస్పత్రులపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టి, ప్రత్యేక అధికారులను నియమించి, వైద్యానికి వెళ్లేవారి వివరాలు సేకరించి, ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో పరిష్కరించగలిగితేనే జగన్ సూచన ఫలిస్తుంది.

అదే సమయంలో ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే కొవిడ్ కేర్ సెంటర్స్ లో బెడ్స్ సంఖ్య పెంచుకుంటూ పోతే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండూ జరిగితేనే కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తికి అడ్డుకట్ట పడుతుంది.

First Published:  25 Aug 2020 10:48 PM GMT
Next Story