Telugu Global
Cinema & Entertainment

కొత్త జానర్ టచ్ చేస్తున్న అక్కినేని హీరో

తనకు హారర్ సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండదని, అలాంటి సినిమాలు చూడ్డానికి కూడా ఇష్టపడనని, ఇక అలాంటి సినిమాల్లో నటించడం తన వల్ల కాదని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశాడు నాగచైతన్య. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. త్వరలోనే ఓ హారర్ సబ్జెక్ట్ లో చైతూ కనిపించబోతున్నాడట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతూ. దీనికి థ్యాంక్ యూ అనే టైటిల్ కూడా ఫిక్స్ […]

కొత్త జానర్ టచ్ చేస్తున్న అక్కినేని హీరో
X

తనకు హారర్ సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండదని, అలాంటి సినిమాలు చూడ్డానికి కూడా ఇష్టపడనని, ఇక అలాంటి సినిమాల్లో నటించడం తన వల్ల కాదని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశాడు నాగచైతన్య. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. త్వరలోనే ఓ హారర్ సబ్జెక్ట్ లో చైతూ కనిపించబోతున్నాడట.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతూ. దీనికి థ్యాంక్ యూ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయట. ఇప్పటివరకు నాగచైతన్య టచ్ చేయని జానర్ ఇది. మరి సినిమాలో హారర్ ఉందని తెలిసి కూడా చైతూ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో ఆయనకే తెలియాలి.

అసలు ఈ సబ్జెక్ట్ లో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనే విషయంపై ముందుగా యూనిట్ క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతానికైతే ఎక్కువమంది ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయనే చెబుతున్నారు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే విక్రమ్ కుమార్ సినిమా మొదలవుతుంది.

First Published:  26 Aug 2020 12:00 PM GMT
Next Story