Telugu Global
International

‘నా మెదడు క్యాలిక్యులేటర్ కన్నా వేగం’ !

గణిత మేధావిగా మానవ కంప్యూటర్ గా పేరున్న శకుంతలాదేవినే అధిగమించి…ప్రపంచంలోనే అత్యంత వేగంగా లెక్కలు చేయగల మానవ కాలిక్యులేటర్ గా గుర్తింపు పొందాడు ఇరవై ఒక్క సంవత్సరాల నీలకంఠ భాను ప్రకాష్. మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ (ఎమ్ ఎస్ ఓ)లో భాను ప్రకాష్… మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. భారత్ ఈ పతకాన్ని సాధించడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ కి చెందిన భాను ప్రకాష్… ఢిల్లీ యూనివర్శిటీ మేథ్ మెటిక్స్ […]

‘నా మెదడు క్యాలిక్యులేటర్ కన్నా వేగం’ !
X

గణిత మేధావిగా మానవ కంప్యూటర్ గా పేరున్న శకుంతలాదేవినే అధిగమించి…ప్రపంచంలోనే అత్యంత వేగంగా లెక్కలు చేయగల మానవ కాలిక్యులేటర్ గా గుర్తింపు పొందాడు ఇరవై ఒక్క సంవత్సరాల నీలకంఠ భాను ప్రకాష్. మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ (ఎమ్ ఎస్ ఓ)లో భాను ప్రకాష్… మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. భారత్ ఈ పతకాన్ని సాధించడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ కి చెందిన భాను ప్రకాష్… ఢిల్లీ యూనివర్శిటీ మేథ్ మెటిక్స్ ( ఆనర్స్) విద్యార్థి.

ప్రపంచంలోనే వేగవంతమైన మానవ క్యాలిక్యులేటర్ గా నాలుగు ప్రపంచ రికార్డులను, యాభై లిమ్కా రికార్డులను భాను ప్రకాష్ సొంతం చేసుకున్నాడు. తన మెదడు క్యాలిక్యులేటర్ కన్నా వేగంగా లెక్కలు చేస్తుందంటున్నాడు భాను ప్రకాష్. స్కాట్ ఫ్లాన్స్ బర్గ్, శకుంతలా దేవి లాంటి గణితమేధావుల రికార్డులను అధిగమించడం మనదేశానికి గర్వకారణంగా భావిస్తున్నానని, మనదేశాన్ని గణిత మేధస్సులో ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు తనవంతు ప్రయత్నం చేసినట్టుగా నీలకంఠ భాను ప్రకాష్ తెలిపాడు.

లండన్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్….ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మేధస్సుకి సంబంధించిన పోటీలు. ఆగస్టు 15న వీటిని ఇంటర్ నెట్ ద్వారా నిర్వహించారు. ఈ పోటీల్లోనే భాను ప్రకాష్ బంగారుపతకం సాధించాడు. 13 దేశాల నుండి 30 మంది పోటీదారులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో 57ఏళ్ల వరకు వయసున్నవారున్నారు. లెబనాన్ కి చెందిన గణిత మేధావిపై 65 పాయింట్లతో భాను ప్రకాష్ విజయం సాధించగా యుఎఇకి చెందిన పోటీ దారుడు మూడోస్థానంలో నిలిచాడు.

భారతదేశంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు లెక్కలంటే భయపడుతున్నారని….దేశ వ్యాప్తంగా లక్షల మంది పిల్లలను లెక్కల ఫోబియా నుండి బయటపడేసేందుకు తాను ‘విజన్ మ్యాథ్’ ల్యాబులను ప్రారంభించాలనుకుంటున్నానని నీలకంఠ భాను ప్రకాష్ తెలిపాడు.

First Published:  25 Aug 2020 8:10 PM GMT
Next Story