Telugu Global
National

విజయవాడలో ఐదు కోవిడ్ సెంటర్ల అనుమతులు రద్దు

నిబంధనలను బేఖాతురు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజయవాడలో ఐదు ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులను అధికారులు రద్దు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు వాస్తవమేనని తేలడంతో అనుమతులు రద్దు చేశారు. రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్‌ స్వర్ణ హైట్స్‌ కోవిడ్ కేర్‌ సెంటర్‌కు అనుమతులు రద్దు అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు అధిక ఫీజులు వసూలు చేశారన్నది రమేష్ ఆస్పత్రికి చెందిన స్వర్ణ […]

విజయవాడలో ఐదు కోవిడ్ సెంటర్ల అనుమతులు రద్దు
X

నిబంధనలను బేఖాతురు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజయవాడలో ఐదు ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులను అధికారులు రద్దు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు వాస్తవమేనని తేలడంతో అనుమతులు రద్దు చేశారు.

రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్‌ స్వర్ణ హైట్స్‌ కోవిడ్ కేర్‌ సెంటర్‌కు అనుమతులు రద్దు అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు అధిక ఫీజులు వసూలు చేశారన్నది రమేష్ ఆస్పత్రికి చెందిన స్వర్ణ హైట్స్‌పై ఫిర్యాదులు వచ్చాయి. ఎనికేపాడులోని లక్ష్మీనర్సింగ్ హోమ్‌… హోటల్ అక్షయలో నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్‌ అనుమతులు రద్దు అయ్యాయి.

ఐరా హోటల్‌లో ఇండో బ్రిటీష్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్‌కు, హోటల్ మర్గ్ కృష్ణయ్య, హోటల్‌ సన్‌సిటీలో ఆంధ్రా ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్‌ సెంటర్లకు, అధికారులు అనుమతులు రద్దు చేశారు.

First Published:  25 Aug 2020 10:59 PM GMT
Next Story