అమరావతి రైతులకు 158 కోట్లు విడుదల

అమరావతికి భూములిచ్చిన వారికి వార్షిక కౌలును ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రెండు నెలల పెన్షన్‌ సొమ్మును మంజూరు చేసింది. వార్షిక కౌలు కోసం 158కోట్లు విడుదల చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

రెండు నెలల పించన్‌ కోసం 9.73 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సొమ్ము నేరుగా భూములిచ్చిన వారి ఖాతాల్లో జమ అవుతుందని బొత్స చెప్పారు.

భూములిచ్చిన వారికి తక్షణం కౌలు చెల్లించాలంటూ బుధవారం అమరావతి పరిపక్షణ సమితి ఏఎంఆర్‌డీఏ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సొమ్మును ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది.