Telugu Global
Health & Life Style

పచ్చిమిరప... మధుమేహులకు మంచి మిరప!

వంటల్లో ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరప కూడా తప్పనిసరిగా వాడుతుంటాం. ఇవి ఏ వంటకంలో వాడినా ఆ వంటకు మరింత రుచి పెరుగుతుంది. పచ్చిమిరపతో వంటకు రుచే కాదు… ఒంటికి ఆరోగ్యం కూడా.  ఆకుపచ్చని మిరపకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని అన్ని అవయవాలకు మేలు చేస్తాయి. పచ్చిమిరపని తినటం వలన మన మెటబాలిజం రేటు… అంటే జీవక్రియల వేగం 50శాతం పెరుగుతుందట. అందుకే బరువుని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. జిందాల్ నేచర్ క్యూర్ ఇన్ స్టిట్యూట్ […]

పచ్చిమిరప... మధుమేహులకు మంచి మిరప!
X

వంటల్లో ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరప కూడా తప్పనిసరిగా వాడుతుంటాం. ఇవి ఏ వంటకంలో వాడినా ఆ వంటకు మరింత రుచి పెరుగుతుంది. పచ్చిమిరపతో వంటకు రుచే కాదు… ఒంటికి ఆరోగ్యం కూడా. ఆకుపచ్చని మిరపకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని అన్ని అవయవాలకు మేలు చేస్తాయి.

పచ్చిమిరపని తినటం వలన మన మెటబాలిజం రేటు… అంటే జీవక్రియల వేగం 50శాతం పెరుగుతుందట. అందుకే బరువుని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. జిందాల్ నేచర్ క్యూర్ ఇన్ స్టిట్యూట్ లో డైటీషియన్ గా ఉన్న సుష్మ… పచ్చిమిరప తినటం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఆమె చెబుతున్న దాన్ని బట్టి… వీటిలో ఉండే కాస్పయిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్… శరీరంలో వేడిని పెంచి మెటబాలిజం రేటు పెంచుతుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటం కూడా ఒక మంచి విషయం. పచ్చిమిరపని రోజుకి 12 నుండి 15 గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా తింటే ఎసిడిటీ, పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాగే వీటిని పచ్చిగా కాకుండా కూరలు, సలాడ్లు, పచ్చళ్ల ద్వారా తీసుకోవటం మంచిదంటున్నారు సుష్మ.

మధుమేహం ఉన్నవారిలో షుగర్ నియంత్రణలో ఉండేందుకు పచ్చిమిరప సహకరిస్తుంది. అయితే ఇందుకోసం రోజుకి 30 గ్రాముల వరకు వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో మెటబాలిజం రేటు పెరిగి శరీరం షుగర్ ని వినియోగించుకునే అవకాశం పెరుగుతుంది.

పచ్చిమిరపలో ఎ బి6 సి విటమిన్లతో పాటు క్యాల్షియం, జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంటే పచ్చిమిరపని మన ఆహారంలో చేర్చుకోవటం వలన మన చర్మం, కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ… వీటన్నింటికీ మేలు కలుగుతుంది. వీటిలో వాపుగుణాన్ని తగ్గించే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు సైతం ఉండటం వలన ఎముకలు, కీళ్లకు సంబంధించిన వ్యాధులతో బాధపడే వారికి సైతం పచ్చిమిరపకాయలు మేలు చేస్తాయి.

First Published:  26 Aug 2020 8:15 PM GMT
Next Story