Telugu Global
National

రియా నా కుమారుడికి విషం ఇచ్చింది...

హీరో సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ ప్రవర్తన, మానసిక స్థితిపై ఆమె కొన్ని వివరాలు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో సుశాంత్ చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడని చెప్పారామె. కొన్నిసార్లు హోటల్ గది నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడేవాడు కాదని వివరించారు. హోటల్‌ గదిలో విచిత్రమైన చిత్రాలు కనిపిస్తే భయపడేవాడని చెప్పారు. అలాంటి […]

రియా నా కుమారుడికి విషం ఇచ్చింది...
X

హీరో సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ ప్రవర్తన, మానసిక స్థితిపై ఆమె కొన్ని వివరాలు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో సుశాంత్ చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడని చెప్పారామె. కొన్నిసార్లు హోటల్ గది నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడేవాడు కాదని వివరించారు.

హోటల్‌ గదిలో విచిత్రమైన చిత్రాలు కనిపిస్తే భయపడేవాడని చెప్పారు. అలాంటి బొమ్మలు చూసి ఒక రాత్రంతా సరిగా సుశాంత్ నిద్రపోలేదని వివరించారు. 2013లో ఒకసారి మానసిక వైద్యుడి వద్దకు వెళ్లాడని రియా చెప్పారు. ఆ వైద్యుడి సూచన మేరకు మెడాఫినాల్‌ అనే మందును సుశాంత్ వాడేవారని వెల్లడించారు.

తన కోసం సుశాంత్ భారీగా డబ్బు ఖర్చు పెట్టారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. సుశాంత్‌ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారని … అలా విలాసవంతంగా గడపడం ఆయన వ్యక్తిగత నిర్ణయమే గానీ తన ప్రభావం ఏమీ లేదని రియా చక్రవర్తి వివరించారు. థాయ్‌లాంట్ ట్రిప్‌ కోసం సుశాంత్ 70 లక్షలు ఖర్చు చేశారని రియా చెప్పారు.

అటు రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా సుశాంత్‌కు రియా విషం ఇస్తూ వచ్చిందని ఆరోపించారు. ఈ విషయంలో రియాకు మరికొందరు సహకరించారని… వారందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు.

First Published:  27 Aug 2020 2:12 AM GMT
Next Story