Telugu Global
CRIME

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన... రూ. 57,200 జరిమానా !

బెంగళూరు నివాసి అయిన ఎల్ రాజేష్ కుమార్ అనే 25ఏళ్ల యువకుడికి రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఉంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను అత్యధికంగా జరిమానా కట్టాల్సిన వాహన యజమానిగా అతను ఓ రికార్డునే సృష్టించాడు. ఎందుకంటే 11 నెలల కాలంలో రాజేష్ పైన 101 ట్రాఫిక్ పరమైన కేసులు నమోదు అయ్యాయి. అతను చెల్లించాల్సిన జరిమానాల మొత్తం రూ. 57,200. పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు రాజేష్ ట్రాఫిక్ ఉల్లంఘనలను చూసి. రాజేష్ ఒక ప్రయివేటు […]

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన... రూ. 57,200 జరిమానా !
X

బెంగళూరు నివాసి అయిన ఎల్ రాజేష్ కుమార్ అనే 25ఏళ్ల యువకుడికి రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఉంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను అత్యధికంగా జరిమానా కట్టాల్సిన వాహన యజమానిగా అతను ఓ రికార్డునే సృష్టించాడు. ఎందుకంటే 11 నెలల కాలంలో రాజేష్ పైన 101 ట్రాఫిక్ పరమైన కేసులు నమోదు అయ్యాయి. అతను చెల్లించాల్సిన జరిమానాల మొత్తం రూ. 57,200. పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు రాజేష్ ట్రాఫిక్ ఉల్లంఘనలను చూసి.

రాజేష్ ఒక ప్రయివేటు కంపెనీ ఉద్యోగి. తను కట్టాల్సిన డబ్బుని మూడురోజుల్లోగా చెల్లిస్తానని పోలీసులను గడువు అడిగాడతను. ఈ లోపు అతని బండిని స్వాధీనం చేసుకుని తమ వద్ద ఉంచుకున్నారు ఎడిగుడి ట్రాఫిక్ పోలీసులు. రాజేష్ చెల్లించాల్సిన చలాన్లు అన్నీ 2019 సెప్టెంబరు 12 నుండి ఈ సంవత్సరం ఆగస్టు 26 మధ్యకాలంలో నమోదైన కేసుల తాలూకావే.

రాజేష్ తను అడిగిన గడుపు లోపల డబ్బు చెల్లించకపోతే తాము ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళతామని పోలీసులు వెల్లడించారు. అతను డబ్బు చెల్లిస్తే… ట్రాఫిక్ కేసులతో అత్యధికంగా జరిమానా చెల్లించిన వ్యక్తుల్లో రాజేష్ పేరు కూడా ఉంటుంది.

కోరమంగళ 1 బ్లాక్ అనే ప్రాంతంలో విప్రో జంక్షన్ వద్ద బుధవారం నాడు ట్రాఫిక్ సిగ్నల్ ని జంప్ చేస్తుండగా పోలీసులు రాజేష్ ని ఆపారు. అయితే ఆ రోజు ఉదయం నుండి అతను ఆరుసార్లు నిబంధనలను మీరినట్టుగా గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు. మరి కాస్త లోతుగా వెళ్లి… పరిశీలించగా సెప్టెంబరు 2019 నుండి అతనిపై 94 కేసులు పెండింగ్ ఉన్నాయని తేలింది. అంతకు కొన్ని నెలల ముందే అతను ఆ బైక్ కొన్నాడు.

రాజేష్ పైన ఉన్న కేసులను గురించి పోలీసులు పై అధికారులకు తెలుపగా వారు బండిని స్వాధీనం చేసుకోమని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు బండిని స్వాధీనం చేసుకుని 5.5 అడుగుల పొడవున్న చలాన్ కాగితాన్ని రాజేష్ చేతుల్లో ఉంచారు.

ఈ ఏడాది ఏప్రిల్ తరువాతే అతనిపై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ 19 కారణంగా తమ సిబ్బంది రోడ్డుపై తక్కువగా ఉండటం వలన అతను హెల్మెట్ ఎప్పుడూ ధరించలేదని పోలీసులు వెల్లడించారు.

First Published:  28 Aug 2020 9:10 AM GMT
Next Story