Telugu Global
Cinema & Entertainment

రేప్ కేసుతో నాకు సంబంధం లేదు

యాంకర్ ప్రదీప్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో తనపై వచ్చిన అలాంటి వివాదాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఈ యాంకర్ కమ్ నటుడు. అయితే ఈసారి తనకు సంబంధం లేని ఓ వివాదంలో తన పేరు రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు ప్రదీప్. మరీ ముఖ్యంగా అత్యంత సున్నితమైన అంశంలో తన పేరు రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ, తనపై 140 మంది అత్యాచారం చేశారంటూ హైదరాబాద్ పంజాగుట్ట […]

రేప్ కేసుతో నాకు సంబంధం లేదు
X

యాంకర్ ప్రదీప్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో తనపై వచ్చిన అలాంటి వివాదాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఈ యాంకర్ కమ్ నటుడు. అయితే ఈసారి తనకు సంబంధం లేని ఓ వివాదంలో తన పేరు రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు ప్రదీప్. మరీ ముఖ్యంగా అత్యంత సున్నితమైన అంశంలో తన పేరు రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ, తనపై 140 మంది అత్యాచారం చేశారంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. చాలా రోజుల నుంచి తనపై అకృత్యాలు జరుగుతున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ 140 మంది జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ బయటకొచ్చింది. అందులో యాంకర్ ప్రదీప్ అనే పేరు ఉంది.

దీంతో నిజానిజాలు తెలుసుకోకుండా చాలా వెబ్ సైట్స్, యూట్యూబ్ సంస్థలు ప్రదీప్ పై వార్తలు రాసేశాయి. ప్రదీప్ ఫొటో కూడా ఉపయోగించాయి. వీటన్నింటిపై ప్రదీప్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసిన ప్రదీప్.. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వార్తలు రాసిన సదరు సంస్థలు, వ్యక్తులపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని స్పష్టంచేశాడు.

తనకు కూడా ఓ కుటుంబం ఉందని.. ఇలాంటి వార్తల వల్ల తనకు గానీ, తన కుటుంబానికి ఏదైనా జరిగితే లీగల్ గా ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించాడు ప్రదీప్. చేతనైతే నలుగురికి సహాయం చేయడం తప్ప, కీడు తలపెట్టే నైజం తనది కాదంటున్న ప్రదీప్.. ఇప్పటికైనా ఓ సెక్షన్ మీడియా.. తనను వేధించడం మానుకోవాలని కోరుతున్నాడు. జరిగిన ఘటనపై న్యాయపోరాటం చేస్తానని, ఎంత దూరమైనా వెళ్తానని స్పష్టం చేశాడు ఈ యాంకర్ కమ్ నటుడు.

First Published:  27 Aug 2020 10:08 PM GMT
Next Story