Telugu Global
National

చంద్రబాబు చరిత్రను తవ్వి తీస్తున్న వైసీపీ నేతలు....

చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. రాజకీయ లబ్ధికోసం ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారు, పొగిడిన నోటితోనే ఎలా తిడతారు, తిట్టిన నోటితోనే మళ్లీ ఎలా ఆప్యాయంగా పలకరిస్తారో అందరికీ అర్థమయ్యేలా పాత వీడియోలన్నీ బైటకు వదులుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త సంస్కృతికి తెరతీశారు. బాబు రాజకీయ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలను తేదీలతో సహా గుర్తు పెట్టుకుని వాటికి వార్షికోత్సవాలు, రజతోత్సవాలు చేస్తూ పరువు […]

చంద్రబాబు చరిత్రను తవ్వి తీస్తున్న వైసీపీ నేతలు....
X

చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. రాజకీయ లబ్ధికోసం ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారు, పొగిడిన నోటితోనే ఎలా తిడతారు, తిట్టిన నోటితోనే మళ్లీ ఎలా ఆప్యాయంగా పలకరిస్తారో అందరికీ అర్థమయ్యేలా పాత వీడియోలన్నీ బైటకు వదులుతున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త సంస్కృతికి తెరతీశారు. బాబు రాజకీయ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలను తేదీలతో సహా గుర్తు పెట్టుకుని వాటికి వార్షికోత్సవాలు, రజతోత్సవాలు చేస్తూ పరువు తీస్తున్నారు. ఇటీవల వెన్నుపోటుకి పాతికేళ్లు అంటూ పెద్ద ట్రెండింగ్ సోషల్ మీడియాలో నడిచింది.

ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీని చంద్రబాబు లాగేసుకుని పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్ట్ 25న వెన్నుపోటు రజతోత్సవాన్ని నిర్వహించారు వైసీపీ నేతలు. ఇటీవల ఏపీ బీజేపీలో కూడా పరిణామాలు మారిపోవడంతో కాషాయ దళం కూడా బాబుని తరుముకుంటోంది. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్ కూడా ట్విట్టర్లో బాబు వెన్నుపోటుని గుర్తు చేసి మరీ రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కించారు. ఇది జరిగిన కథ. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వైసీపీ శ్రేణులు చంద్రబాబు రక్తపాత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

బషీర్ బాగ్ లో బాబు సృష్టించిన మారణహోమానికి నేటితో 20ఏళ్లు పూర్తవుతున్నాయని, చంద్రబాబు ఎంతటి క్రూరుడో, ఎంతటి విధ్వంస కారుడో చరిత్రే చెబుతోందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బషీర్ బాగ్ కాల్పులకి గుర్తుగా బాబు రక్తపాత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు విజయసాయిరెడ్డి. పెంచిన కరెంటు చార్జీలకు నిరసనగా బషీర్ బాగ్ లో ప్రదర్శన చేపట్టిన వామపక్ష కార్యకర్తలపై పోలీసులను ఉసిగొల్పి ముగ్గురి మరణానికి కారణమయ్యారని విమర్శించారు విజయసాయిరెడ్డి. ముందు ముందు ఇలాంటి దినోత్సవాలు మరిన్ని ఉంటాయని అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.

First Published:  28 Aug 2020 9:29 AM GMT
Next Story