Telugu Global
International

భారత్ నుండి లండన్ కి బస్... నిజమేనా?!

కొన్నిరోజుల ముందు కోల్ కతా నుండి లండన్ కి బస్ అంటూ… ఒక పాత ఫొటో ట్విట్టర్లో కనిపించి వైరల్ గా మారింది. అయితే అది నిజం కాదని… ఫేక్ అని చాలామంది అనుకుని ఉంటారు. దేశాలు దాటుకుంటూ భారత్ నుండి లండన్ కి సాగే అద్భుతమైన ప్రయాణం గురించి ట్విట్లర్లో వచ్చిన వార్త నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గుర్ గ్రామ్ కి చెందిన ఒక ట్రావెల్ కంపెనీ 2021లో లండన్ కి రెండు […]

భారత్ నుండి లండన్ కి బస్... నిజమేనా?!
X

కొన్నిరోజుల ముందు కోల్ కతా నుండి లండన్ కి బస్ అంటూ… ఒక పాత ఫొటో ట్విట్టర్లో కనిపించి వైరల్ గా మారింది. అయితే అది నిజం కాదని… ఫేక్ అని చాలామంది అనుకుని ఉంటారు. దేశాలు దాటుకుంటూ భారత్ నుండి లండన్ కి సాగే అద్భుతమైన ప్రయాణం గురించి ట్విట్లర్లో వచ్చిన వార్త నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గుర్ గ్రామ్ కి చెందిన ఒక ట్రావెల్ కంపెనీ 2021లో లండన్ కి రెండు నెలల బస్ ట్రిప్ ఉంటుందని ప్రకటించింది.

ఈ ప్రయాణ దూరం 20 వేల కిలోమీటర్లు. 18 దేశాల మీదుగా 70 రోజులపాటు సాగుతుంది. ఢిల్లీ నుండి ప్రయాణం మొదలవుతుంది. మయన్మార్, థాయ్ లాండ్, లావోస్, చైనా, కిర్జిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్, లాట్వియా, లిథువేనియా, పోలండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్, లండన్… ఇలా ఉంటుంది ప్రయాణం.

ఏప్రిల్ 18 న బయలుదేరిన బస్… జూన్ 8న గమ్యం చేరుతుంది. ఒక్కొక్క ప్రయాణీకుడికి ప్రయాణ ఖర్చు 15 లక్షల రూపాయల వరకు అవుతుంది. ప్రయాణీకులకు అన్ని వసతులు ఉన్న లగ్జరీ బస్ ఇది. ఈ బస్ లో 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందంటున్నారు ప్రయాణ నిర్వాహకులు.

First Published:  27 Aug 2020 9:43 PM GMT
Next Story