Telugu Global
Cinema & Entertainment

ఆచార్య షూటింగ్ ఎప్పట్నుంచి?

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది ఆచార్య సినిమా షూటింగ్. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్నప్పటికీ సినిమాను మాత్రం సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో లేరు చిరంజీవి. కేవలం 40శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది ఎవ్వరూ సమాధానం చెప్పలేని ప్రశ్న. అటు దర్శకుడు కొరటాల శివ కూడా దాదాపు ఇలానే స్పందించారు. ఆచార్య సినిమా సెట్స్ పైకి రావడానికి మరో 2 నెలలైనా పట్టొచ్చని అభిప్రాయపడ్డారు దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం […]

ఆచార్య షూటింగ్ ఎప్పట్నుంచి?
X

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది ఆచార్య సినిమా షూటింగ్. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్నప్పటికీ సినిమాను మాత్రం సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో లేరు చిరంజీవి. కేవలం 40శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది ఎవ్వరూ సమాధానం చెప్పలేని ప్రశ్న. అటు దర్శకుడు కొరటాల శివ కూడా దాదాపు ఇలానే స్పందించారు.

ఆచార్య సినిమా సెట్స్ పైకి రావడానికి మరో 2 నెలలైనా పట్టొచ్చని అభిప్రాయపడ్డారు దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం తక్కువ మంది సిబ్బందితో ఆచార్య సినిమాను షూట్ చేయడం సాధ్యం కాదని తేల్చేశారు కొరటాల. తన సినిమాకు కనీసం ప్రతి రోజూ 150 మంది వర్క్ చేయాల్సి ఉంటుందని, అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఇప్పట్లో సినిమా సెట్స్ పైకి రాదని అంటున్నారు.

అయితే సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వచ్చినా ఈసారి రామ్ చరణ్ జాయిన్ అవుతాడని స్పష్టంచేశారు కొరటాల. సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం చరణ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ ను కొత్త షెడ్యూల్ లో పూర్తిచేయాలనేది కొరటాల ప్లాన్.

First Published:  28 Aug 2020 9:45 PM GMT
Next Story