Telugu Global
Cinema & Entertainment

హ్యాట్రిక్ మిస్సయిన హిట్ డైరక్టర్

హ్యాట్రిక్స్ కొట్టడం అంత ఈజీ కాదు, అలా అని అంత కష్టం కూడా కాదు. వరుసగా 3 సినిమాలతో హిట్స్ కొట్టిన దర్శకులున్నారు. కానీ వరుసగా 3 సంక్రాంతులకు హిట్స్ కొట్టిన దర్శకులు మాత్రం లేరు. అలాంటి అరుదైన ఫీట్ ను మిస్ చేసుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వరుసగా మూడో సంక్రాంతికి హిట్ కొట్టే ఛాన్స్ మిస్ అయింది. ఎఫ్2 సినిమాతో సంక్రాంతి హిట్ దర్శకుడు అనుకున్నాడు అనీల్ రావిపూడి. ఆ వెంటనే మహేష్ తో […]

Anil Ravipudi
X

హ్యాట్రిక్స్ కొట్టడం అంత ఈజీ కాదు, అలా అని అంత కష్టం కూడా కాదు. వరుసగా 3 సినిమాలతో హిట్స్ కొట్టిన దర్శకులున్నారు. కానీ వరుసగా 3 సంక్రాంతులకు హిట్స్ కొట్టిన దర్శకులు మాత్రం లేరు. అలాంటి అరుదైన ఫీట్ ను మిస్ చేసుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వరుసగా మూడో సంక్రాంతికి హిట్ కొట్టే ఛాన్స్ మిస్ అయింది.

ఎఫ్2 సినిమాతో సంక్రాంతి హిట్ దర్శకుడు అనుకున్నాడు అనీల్ రావిపూడి. ఆ వెంటనే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి, దాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. ఇంకొక్క సంక్రాంతి కవర్ చేసి హిట్ కొడితే.. అనీల్ ఖాతాలో అరుదైన రికార్డు జమయ్యేది. కానీ అది కాస్తా మిస్సయింది.

నెక్ట్స్ సంక్రాంతికి ఎఫ్3ని రెడీ చేశాడు అనీల్ రావిపూడి. వెంకీ-వరుణ్ తో ఎఫ్2కు సీక్వెల్ తీసి మళ్లీ సంక్రాంతికి రావాలనేది ప్లాన్. కానీ కరోనా రావడం, లాక్ డౌన్ పడ్డంతో అనీల్ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. అలా వచ్చే సంక్రాంతిని మిస్సయ్యాడు అనీల్.

పోనీ ఎఫ్3ని పక్కనపెట్టి ఇప్పటికిప్పుడు మరో ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామన్నా కూడా అనీల్ కు పరిస్థితులు అనుకూలంగా లేవు. సో.. అనీల్ ఈసారి హ్యాట్రిక్ మిస్ అయినట్టే.

First Published:  29 Aug 2020 8:00 AM GMT
Next Story