Telugu Global
Health & Life Style

చెన్నైలో ఊపిరితిత్తుల మార్పిడి...ఆసియాలో తొలిసారి !

చెన్నైలోని ఒక ప్రయివేటు హాస్పటల్లో వైద్యులు విజయవంతంగా ఓ కరోనా పాజిటివ్ పేషంటుకి ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. కోవిడ్ 19 పాజిటివ్ పేషంటుకి ఈ తరహా క్లిష్టమైన వైద్యప్రక్రియని నిర్వహించడం ఆసియాలో ఇదే మొదటిసారని, లాక్ డౌన్ మొదలైన తరువాత ఇది తాము చేసిన రెండవ ఊపిరితిత్తుల మార్పిడి అని సదరు హాస్పటల్ వైద్యులు తెలిపారు. 48 ఏళ్ల వయసున్న ఓ వ్యాపారవేత్తకు కరోనా కారణంగా ఫైబ్రోసిస్ అనే పరిస్థితి ఏర్పడి ఊపిరితిత్తులు పాడయ్యాయి. గరుగ్రామ్ […]

చెన్నైలో ఊపిరితిత్తుల మార్పిడి...ఆసియాలో తొలిసారి !
X

చెన్నైలోని ఒక ప్రయివేటు హాస్పటల్లో వైద్యులు విజయవంతంగా ఓ కరోనా పాజిటివ్ పేషంటుకి ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. కోవిడ్ 19 పాజిటివ్ పేషంటుకి ఈ తరహా క్లిష్టమైన వైద్యప్రక్రియని నిర్వహించడం ఆసియాలో ఇదే మొదటిసారని, లాక్ డౌన్ మొదలైన తరువాత ఇది తాము చేసిన రెండవ ఊపిరితిత్తుల మార్పిడి అని సదరు హాస్పటల్ వైద్యులు తెలిపారు.

48 ఏళ్ల వయసున్న ఓ వ్యాపారవేత్తకు కరోనా కారణంగా ఫైబ్రోసిస్ అనే పరిస్థితి ఏర్పడి ఊపిరితిత్తులు పాడయ్యాయి. గరుగ్రామ్ కి చెందిన ఆ వ్యక్తిని వెంటిలేటర్ పైన ఉంచి, ఎక్మో ట్రీట్ మెంట్ ఇప్పిస్తూనే… విమాన ప్రయాణం ద్వారా తీసుకుని వచ్చి ఈ హాస్పటల్ లో చేర్చారు.

ఎమ్ జి ఎమ్ హెల్త్ కేర్ లో హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రామ్ చైర్మన్, డైరక్టర్ డాక్టర్ కెఆర్ బాలకృష్ణన్… ఈ విషయం గురించి వివరిస్తూ … కోవిడ్ 19 కి చికిత్స చేసిన అనంతరం అపరేషన్ చేసినట్టుగా తెలిపారు. వైద్యుల బృందం ఎంతో రిస్క్ తీసుకుని ఈ ఆపరేషన్ చేశారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పేషంట్ కి మార్పిడి చేసిన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని, ఎక్మో సపోర్టు కూడా తీసేశామని ఎమ్ జి ఎమ్ హెల్త్ కేర్ కో డైరక్టర్ డాక్టర్ సురేష్ రావు తెలిపారు.

చెన్నైలోని గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పటల్ లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి… ఊపిరితిత్తుల దాత. ఆ వ్యక్తి తాలూకూ గుండెని సైతం మరొక వ్యక్తికి అమర్చినట్టుగా వైద్యులు తెలిపారు. కరోనా సోకినవారిలో చాలా కేసుల్లో త్వరగా హస్పటల్ కి రాకపోవటం వల్లనే ఊపిరితిత్తులు పాడవుతున్నాయని వైద్యులు అంటున్నారు.

First Published:  29 Aug 2020 5:56 AM GMT
Next Story