Telugu Global
Cinema & Entertainment

మరో ఛాన్స్ కొట్టేసిన ప్రవీణ్

దర్శకుడు ప్రవీణ్ సత్తారు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమా ఆఫర్లు అందుకున్నాడు. గరుడవేగ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ డైరక్టర్.. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇప్పటికే నాగార్జున హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ చేసిన ప్రవీణ్.. ఇప్పుడు వరుణ్ తేజ్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు మధ్య రీసెంట్ గా స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఇది. ఈ జానర్ లో ఇప్పటివరకు […]

మరో ఛాన్స్ కొట్టేసిన ప్రవీణ్
X

దర్శకుడు ప్రవీణ్ సత్తారు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమా ఆఫర్లు అందుకున్నాడు. గరుడవేగ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ డైరక్టర్.. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇప్పటికే నాగార్జున హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ చేసిన ప్రవీణ్.. ఇప్పుడు వరుణ్ తేజ్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు.

వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు మధ్య రీసెంట్ గా స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఇది. ఈ జానర్ లో ఇప్పటివరకు వరుణ్ తేజ్ నటించలేదు. అందుకే వెంటనే ప్రవీణ్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా 14 రీల్స్ బ్యానర్ పై వచ్చే అవకాశం ఉంది.

అయితే వరుణ్-ప్రవీణ్ కాంబో తెరపైకి రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఎందుకంటే.. నాగార్జునతో చేయాల్సిన సినిమా ప్రవీణ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అది పూర్తయిన తర్వాతే వరుణ్ తేజ్ సినిమా పట్టాలపైకి వస్తుంది. ఈ గ్యాప్ లో వరుణ్ తేజ్ మరో సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

First Published:  29 Aug 2020 5:00 AM GMT
Next Story