Telugu Global
CRIME

అన్నను హత్య చేసి... ఆరేళ్ల తరువాత లొంగిపోయారు !

సొంత అన్నను హత్యచేసిన ఇద్దరు తమ్ముళ్లు…ఆరేళ్ల అనంతరం తమకు తాముగా వచ్చి పోలీసులకు లొంగిపోయారు. వివరాల్లోకి వెళితే…  పశ్చిమ బెంగాల్, ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని జగద్దాల్ కు చెందిన  అపు సిల్, టపు సిల్ అన్నదమ్ములు. వీరి కంటే పెద్దవాడు నిపు సిల్. వీరికి తమ పూర్వికుల నుండి వచ్చిన ఇల్లు ఉంది. అయితే ముగ్గురిలో పెద్దవాడు నిపు సిల్ ఒక్కడే పనిచేస్తుండేవాడు. అతను సివిల్ ఇంజినీర్. మిగిలిన ఇద్దరు నిరుద్యోగులు. దాంతో ఆస్తి గురించి […]

అన్నను హత్య చేసి... ఆరేళ్ల తరువాత లొంగిపోయారు !
X

సొంత అన్నను హత్యచేసిన ఇద్దరు తమ్ముళ్లు…ఆరేళ్ల అనంతరం తమకు తాముగా వచ్చి పోలీసులకు లొంగిపోయారు.

వివరాల్లోకి వెళితే… పశ్చిమ బెంగాల్, ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని జగద్దాల్ కు చెందిన అపు సిల్, టపు సిల్ అన్నదమ్ములు. వీరి కంటే పెద్దవాడు నిపు సిల్. వీరికి తమ పూర్వికుల నుండి వచ్చిన ఇల్లు ఉంది. అయితే ముగ్గురిలో పెద్దవాడు నిపు సిల్ ఒక్కడే పనిచేస్తుండేవాడు. అతను సివిల్ ఇంజినీర్. మిగిలిన ఇద్దరు నిరుద్యోగులు. దాంతో ఆస్తి గురించి అన్నదమ్ములు ముగ్గురు గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో డిసెంబరు 2014లో తమ్ముళ్లు ఇద్దరు కలిసి అన్నను చంపేశారు. తమ ఇంటి పెరట్లోనే శవాన్ని పూడ్చి పెట్టారు.

ఆరేళ్ల తరువాత ఇప్పుడు… శుక్రవారం నాడు అపు పోలీస్ స్టేషన్ కు వెళ్లి… తను, తన సోదరుడు టపు కలిసి తమ అన్నని చంపేసినట్టుగా పోలీసులకు తెలిపాడు. మొదట పోలీసులు… అతని మానసిక స్థితి సరిగ్గా లేక అలా అంటున్నాడని అనుకున్నారు. కానీ వారి ఇరుగుపొరుగువారిని విచారించగా… కొన్నేళ్లుగా నిపు కనిపించడం లేదని వారు చెప్పారు.

పోలీసులు అపుతో పాటు వారి ఇంటికి వెళ్లి పెరట్లో తవ్వగా అస్తి పంజరం బయటపడింది. పోలీసులు అపుని, టపుని అరెస్టు చేశారు. అన్నను చంపామనే పశ్చాత్తాపంతోనే పోలీసులకు లొంగిపోయామని వారు వెల్లడించారు. వీరిద్దరూ ఇప్పుడు సుమారు 28, 30 ఏళ్ల వయసులో ఉన్నారు.

అన్నదమ్ములు కొన్నేళ్లుగా ఇంట్లో కనిపించడం లేదని, ఒక రోజు అపు వచ్చి ఇల్లు శుభ్రం చేశాడని… ఎక్కడికి వెళ్లారని అడిగితే… తాము ఢిల్లీ, పుణె, గోవాల్లో సెటిల్ అయినట్టుగా చెప్పాడని ఆ అన్నదమ్ముల పక్కింటివారు చెప్పారు.

First Published:  29 Aug 2020 9:39 AM GMT
Next Story