Telugu Global
Cinema & Entertainment

అమ్మ కోసం ఆచార్య

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగా తండ్రికొడుకులు ఇలా ఒకే సినిమాలో కనిపించడం కొత్తేం కాదు. వింత అంతకంటే కాదు. మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150.. ఇలా కొన్ని సినిమాల్లో చరణ్-చిరు సందడి చేశారు. అయితే ఆచార్య సినిమా మాత్రం అంతకుమించి అంటున్నాడు రామ్ చరణ్. ఇప్పటివరకు కలిసి నటించిన అన్ని సినిమాల్లో చిరంజీవి లేదా చరణ్ కేవలం గెస్ట్ […]

అమ్మ కోసం ఆచార్య
X

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగా తండ్రికొడుకులు ఇలా ఒకే సినిమాలో కనిపించడం కొత్తేం కాదు. వింత అంతకంటే కాదు. మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150.. ఇలా కొన్ని సినిమాల్లో చరణ్-చిరు సందడి చేశారు. అయితే ఆచార్య సినిమా మాత్రం అంతకుమించి అంటున్నాడు రామ్ చరణ్.

ఇప్పటివరకు కలిసి నటించిన అన్ని సినిమాల్లో చిరంజీవి లేదా చరణ్ కేవలం గెస్ట్ రోల్స్ మాత్రమే పోషించారు. కానీ ఇద్దరూ మంచి పాత్రలు పోషిస్తూ కలిసి ఓ సినిమా చేయాలనేది రామ్ చరణ్ తల్లి సురేఖ కోరికంట. ఆ కోరిక ఆచార్య సినిమాతో నెరవేరుతోందని చెబుతున్నాడు రామ్ చరణ్.

ఆచార్య సినిమాలో తనది కేవలం గెస్ట్ రోల్ కాదంటున్నాడు చరణ్. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రను తను పోషిస్తున్నానని తెలిపాడు. అలా తండ్రి సినిమాలో మంచి పాత్ర పోషించి అమ్మ కోరిక నెరవేరుస్తున్నట్టు తెలిపాడు.

ఆచార్య షూటింగ్ ఇంకో 2 నెలల వరకు మొదలవ్వదు. అయితే ఎప్పుడు షెడ్యూల్ మొదలైనా, రామ్ చరణ్ సెట్స్ పైకి వస్తాడు. ఆ తర్వాతే ఆర్ఆర్ఆర్ మొదలవుతుంది.

First Published:  30 Aug 2020 3:00 AM GMT
Next Story